YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పంచాయితీ పెద్దగా రేవంత్

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పంచాయితీ పెద్దగా రేవంత్

హైదరాబాద్, మే 21 
మాజీ మంత్రి మల్లారెడ్డి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి మధ్య భూపంచాది సంచనంగా మారింది. మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి.. అడ్లూరి అనుచరులు సుచిత్రలోని సర్వేనెంబర్ 82కు సంబంధించిన భూమిలో ఘర్షణకు దిగడం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. ఈ భూమి తమదంటే తమదని రెండు వర్గాలు మీడియా వేదికగా ప్రెస్ మీట్ లు పెట్టి రచ్చ రచ్చ చేసేశాయ్. ఈ భూమిని తాను 2015 లోనే కొనుగోలు చేసి కబ్జాలో ఉన్నట్లు మల్లారెడ్డి చెబుతుండగా.. అడ్లూరు మాత్రం తాను మరి కొంతమంది పార్ట్నర్స్ తో కలిసి కొనుగోలు చేసిన ఈ ల్యాండ్ ను మల్లారెడ్డి హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి కబ్జా పెట్టేశారని ఆరోపించారు. మరోవైపు మల్లారెడ్డి మాత్రం ఈ భూమి తనది కాదని నిరూపిస్తే..తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ కూడా విసిరారు.అయితే అడ్లూరి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం..మాజీ మంత్రి మల్లారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. మల్లారెడ్డికి సోమవారం సీఎం రేవంత్ అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సుచిత్రలోని తన రెండు ఎకరాల వివాదాస్పద ల్యాండ్ గురించి వివరంగా తెలియజేశారు. ఇందుకోసం ఆయన ల్యాండ్ కు సంబంధించిన అన్ని రకాల పేపర్లను సీఎం వద్దకు తీసుకెళ్లి చూపించాలని చూస్తున్నారు. ఇక మల్లారెడ్డిని ముఖ్యమంత్రిని కలవనుండడంతో అడ్లూరి లక్ష్మణ్ కూడా సీఎమ్ఓ అపాయింట్మెంట్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.బాధ్యత గల మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి సుచిత్రలోని సర్వేనెంబర్ 80లో చేసిన ఘనకార్యాలు ఏంటో.. సీఎం రేవంత్ రెడ్డికి వివరించాలని అడ్లూరు భావిస్తున్నారు. అయితే ఇద్దరి ఎమ్మెల్యేల మధ్య పంచాయతీ పెద్దగా వ్యవహరించబోతున్న ముఖ్యమంత్రి రేవంత్..ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Related Posts