చెన్నై మే 21
చెంగల్పట్టు జిల్లా మరమలైనగర్ సమీపంలో ఒకే ట్రాక్‌పై నాలుగు సబర్బన్ రైళ్లు ఒకదాని వెనుక ఒకటి అతి దగ్గరగా ఆగిన సంఘటన కలకలం రేపింది. సాంకేతిక లోపం కారణంగా సిగ్నల్ పనిచేయకపోవడంతో ఈ తప్పిదం జరిగిందని రైల్వే భద్రతా విభాగం అధికారులు తెలిపారు. రాజధాని నగరం చెన్నై నుంచి పొరుగు జిల్లాలైన చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్ జిల్లాలకు ప్రతిరోజు నడుపుతున్న సబర్బన్ రైళ్లలో వేలాది మంది ప్రయాణం చేస్తున్నారు. చెన్నై బీచ్-తాంబరం-చెంగల్పట్టు మధ్య నాలుగు రైలు మార్గాలున్నాయి. వీటిలో రెండు మార్గాల్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మిగతా రెండు మార్గాల్లో సబర్బన్ రైళ్లు నడుపుతున్నారు.