చంద్రగిరి
చంద్రగిరిలో హింసాత్మక ఘటనలతో పోలీసుల అలెర్ట్ అయ్యారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్ఐలు 70 మంది కానిస్టేబుల్లు బృందంగా ఏర్పడి సోదాలు జరిపారు. ఇళ్లు, దుకాణాల్లో మారణాయుధాలు, నేరాలకు ఉపయోగించే వస్తువులను గుర్తించే పనిలో పోలీసులు వున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.