YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాసులు కురిపిస్తున్న ఫ్యాన్సీ నెంబర్లు

కాసులు కురిపిస్తున్న ఫ్యాన్సీ నెంబర్లు

హైదరాబాద్, మే 21
ఓ వాహన ఫ్యాన్సీ నెంబరు ఏకంగా రూ.25.50 లక్షల ధర పలికింది. రవాణా శాఖకు ఓ ఫ్యాన్సీ నెంబరుకు  ఇంత రాబడి రావడం రాష్ట్రంలోనే ఇది తొలిసారి. ఖైరతాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్ ప్రారంభమైన క్రమంలో ఆన్ లైన్ వేలం నిర్వహించారు. టీజీ09 9999 నెంబరును సోని ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్ తమ టయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్ఎక్స్ వాహనం కోసం దక్కించుకుంది. ఆర్టీఏ విధించిన రూ.50 వేల ఫీజుతో పాటు, బిడ్డింగ్ మొత్తం రూ.25.50 లక్షలు చెల్లించి ఈ నెంబరును సొంతం చేసుకుంది. ఆన్ లైన్‌లో ఈ స్థాయిలో పోటీ రావడం తెలంగాణలోనే ఇదో తొలిసారి అని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ సి.రమేష్ తెలిపారు. దీంతోపాటు మరికొన్ని ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా ఒక్కరోజే రవాణా శాఖకు రూ.43,70,284 ఆదాయం సమకూరిందని చెప్పారు.
ఆల్ నైన్స్ అత్యధిక బిడ్డింగ్ ఇలా..
TS 09 GD 9999 నెంబరుకు ముప్పా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.15,53,000 చెల్లించింది.
TS 09 GE 9999 నెంబరుకు కీస్టోన్స్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ రూ.17.35 లక్షలు చెల్లించింది.
TS 09 GC 9999 ఫ్యాన్సీ నెంబరుకు ప్రైమ్ సోర్స్ గ్లోబల్ సర్వీస్ చెల్లించిన మొత్తం రూ.21.60 లక్షలు
TG 09 9999 నెంబరుకు సోనీ ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్ రూ.25.50 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది.

Related Posts