YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కాలా విడుదలకు కష్టాలు

కాలా విడుదలకు కష్టాలు

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం ‘కాలా’ విడుదలకు సిద్ధమైపోయింది. జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే తాజా పరిణామాలు ‘కాలా’కు బ్రేకులు వేసేలా కనిపిస్తున్నాయి. సినిమాలో తన తండ్రి పేరు, జీవిత కథను వాడుకున్నారంటూ ముంబైకి చెందిన జర్నలిస్టు జవహర్ నాడార్.. రజినీకాంత్‌తో పాటు ‘కాలా’ టీంకు లీగల్ నోటీసులు పంపారు. తన నోటీసుపై సమాధానం రాకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్న జవహర్.. ఇప్పుడు ‘కాలా’ విడుదలను అడ్డుకోవడానికే ఈ నోటీసులు పంపించారని సినీ విశ్లేషకులు అంటున్నారు. పిటిషనర్ వాదన ప్రకారం.. ఆయన తండ్రి తిరవయమ్ నాడార్ 1957లో టుటికోరిన్ నుంచి ముంబైలోని ధరవికి వచ్చారు. అప్పట్లో టుటికోరిన్‌లో తీవ్రమైన కరువు, నీటి ఎద్దడి కారణంగా చాలా మంది ధరవికి వలస వచ్చారు. అయితే స్వయంకృషితో ఎదిగిన తిరవయమ్ నాడార్.. ధరవిలో మంచి పేరు సంపాదించారు. అక్కడ ఎక్కువగా తమిళ ప్రజలే నివసించడంతో వాళ్లందరికీ అండదండగా ఉంటూ నాడార్ ‘గాడ్‌ఫాదర్’ అయ్యారు. అంతేకాకుండా ప్రాంతంలో నాడార్‌ను ‘గుడ్వాలా సేఠ్’, ‘కాలా సేఠ్’ అని పిలిచేవారని జవహర్ పేర్కొన్నారు. ధరవిలో తన తండ్రి చక్కెర, బెల్లం వ్యాపారం చేసేవారని తెలిపారు.  ‘కాలా’ సినిమాలో తన తండ్రి కథను వాడారా లేదా అనే విషయంపై తనకు విరవణ కావాలని, ‘కాలా’ టీం వివరణ ఇవ్వాలని జవహర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. వివరణ ఇవ్వని నేపథ్యంలో తాను సినిమా విడుదలను ఆపాలని కోరుతూ కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. ఒక వేళ సినిమా కథ తన తండ్రిదే అయితే తన పేరును టైటిల్ కార్డులో ప్రస్తావించాలని, అలాగే రూ.100 కోట్ల పరువు నష్టం చెల్లించాలని సూచించారు. రాజకీయ లబ్ది కోసమే రజినీకాంత్, పా రంజిత్ ఈ సినిమాను తెరకెక్కించినట్లు తాను నమ్ముతున్నానని జవహర్ పేర్కొ్న్నారు.  మరో వైపు రజనీకాంత్ హీరోగా నటించిన కాలా సినిమా కర్ణాటకలో విడుదల చెయ్యరాదని  వారం రోజుల నుంచి కర్ణాటకలో ఆందోళనలు చేస్తున్నారు. కావేరి నీటి విషయంలో కన్నడిగులను కించపరుస్తూ కర్ణాటక రాష్ట్రానికి ద్రోహం చెయ్యడానికి ప్రయత్నిస్తున్న రజనీకాంత్ కాలా సినిమాను విడుదల చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ  బెంగళూరులో కర్ణాటక రక్షణా వేదిక ధర్నా నిర్వహించింది. కాలా సినిమా విడుదల చెయ్యాలని రజనీకాంత్ ఫ్యాన్స్ ఎంట్రీ ఇచ్చారు. కాలా సినిమా కర్ణాటకలో విడుదల చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ శనివారం కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి ముందు కర్ణాటక రక్షణా వేదిక నాయకుడు ప్రవీణ్ కుమార్ శెట్టి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రజనీకాంత్ కన్నడ ద్రోహి కర్ణాటకలో పుట్టి తమిళనాడులో స్థిరపడిన రజనీకాంత్ కావేరీ నీటి పంపిణి విషయంలో కర్ణాటకకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఆయన కన్నడిగుల వ్యతిరేకి అని ప్రవీణ్ కుమార్ శెట్టి ఆరోపించారు. రజనీకాంత్ నటించిన కాలా సినిమా కర్ణాటకలో విడుదల కానివ్వమని ప్రవీణ్ కుమార్ శెట్టి హెచ్చరించారు. కాలాను అడ్డుకోలేం కాలా సినిమా విడుదలకు అనుమతి ఇవ్వరాదని డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణా వేదిక నాయకుడు ప్రవీణ్ కుమార్ శెట్టి కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు  గోవింద్ కు వినతిపత్రం ఇచ్చారు. కాలా సినిమా కర్ణాటక పంపిణిదారులు, సినిమా థియేటర్ల యాజమాన్యం సినిమా విడుదల చేసే విషయంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని, ఈ సందర్బంలో తాము నేరుగా సినిమా విడుదలను నిషేదించలేమని  అంటున్నారు.సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం ‘కాలా’ విడుదలకు సిద్ధమైపోయింది. జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే తాజా పరిణామాలు ‘కాలా’కు బ్రేకులు వేసేలా కనిపిస్తున్నాయి. సినిమాలో తన తండ్రి పేరు, జీవిత కథను వాడుకున్నారంటూ ముంబైకి చెందిన జర్నలిస్టు జవహర్ నాడార్.. రజినీకాంత్‌తో పాటు ‘కాలా’ టీంకు లీగల్ నోటీసులు పంపారు. తన నోటీసుపై సమాధానం రాకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్న జవహర్.. ఇప్పుడు ‘కాలా’ విడుదలను అడ్డుకోవడానికే ఈ నోటీసులు పంపించారని సినీ విశ్లేషకులు అంటున్నారు. పిటిషనర్ వాదన ప్రకారం.. ఆయన తండ్రి తిరవయమ్ నాడార్ 1957లో టుటికోరిన్ నుంచి ముంబైలోని ధరవికి వచ్చారు. అప్పట్లో టుటికోరిన్‌లో తీవ్రమైన కరువు, నీటి ఎద్దడి కారణంగా చాలా మంది ధరవికి వలస వచ్చారు. అయితే స్వయంకృషితో ఎదిగిన తిరవయమ్ నాడార్.. ధరవిలో మంచి పేరు సంపాదించారు. అక్కడ ఎక్కువగా తమిళ ప్రజలే నివసించడంతో వాళ్లందరికీ అండదండగా ఉంటూ నాడార్ ‘గాడ్‌ఫాదర్’ అయ్యారు. అంతేకాకుండా ప్రాంతంలో నాడార్‌ను ‘గుడ్వాలా సేఠ్’, ‘కాలా సేఠ్’ అని పిలిచేవారని జవహర్ పేర్కొన్నారు. ధరవిలో తన తండ్రి చక్కెర, బెల్లం వ్యాపారం చేసేవారని తెలిపారు.  ‘కాలా’ సినిమాలో తన తండ్రి కథను వాడారా లేదా అనే విషయంపై తనకు విరవణ కావాలని, ‘కాలా’ టీం వివరణ ఇవ్వాలని జవహర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. వివరణ ఇవ్వని నేపథ్యంలో తాను సినిమా విడుదలను ఆపాలని కోరుతూ కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. ఒక వేళ సినిమా కథ తన తండ్రిదే అయితే తన పేరును టైటిల్ కార్డులో ప్రస్తావించాలని, అలాగే రూ.100 కోట్ల పరువు నష్టం చెల్లించాలని సూచించారు. రాజకీయ లబ్ది కోసమే రజినీకాంత్, పా రంజిత్ ఈ సినిమాను తెరకెక్కించినట్లు తాను నమ్ముతున్నానని జవహర్ పేర్కొ్న్నారు.  మరో వైపు రజనీకాంత్ హీరోగా నటించిన కాలా సినిమా కర్ణాటకలో విడుదల చెయ్యరాదని  వారం రోజుల నుంచి కర్ణాటకలో ఆందోళనలు చేస్తున్నారు. కావేరి నీటి విషయంలో కన్నడిగులను కించపరుస్తూ కర్ణాటక రాష్ట్రానికి ద్రోహం చెయ్యడానికి ప్రయత్నిస్తున్న రజనీకాంత్ కాలా సినిమాను విడుదల చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ  బెంగళూరులో కర్ణాటక రక్షణా వేదిక ధర్నా నిర్వహించింది. కాలా సినిమా విడుదల చెయ్యాలని రజనీకాంత్ ఫ్యాన్స్ ఎంట్రీ ఇచ్చారు. కాలా సినిమా కర్ణాటకలో విడుదల చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ శనివారం కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి ముందు కర్ణాటక రక్షణా వేదిక నాయకుడు ప్రవీణ్ కుమార్ శెట్టి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రజనీకాంత్ కన్నడ ద్రోహి కర్ణాటకలో పుట్టి తమిళనాడులో స్థిరపడిన రజనీకాంత్ కావేరీ నీటి పంపిణి విషయంలో కర్ణాటకకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఆయన కన్నడిగుల వ్యతిరేకి అని ప్రవీణ్ కుమార్ శెట్టి ఆరోపించారు. రజనీకాంత్ నటించిన కాలా సినిమా కర్ణాటకలో విడుదల కానివ్వమని ప్రవీణ్ కుమార్ శెట్టి హెచ్చరించారు. కాలాను అడ్డుకోలేం కాలా సినిమా విడుదలకు అనుమతి ఇవ్వరాదని డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణా వేదిక నాయకుడు ప్రవీణ్ కుమార్ శెట్టి కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు  గోవింద్ కు వినతిపత్రం ఇచ్చారు. కాలా సినిమా కర్ణాటక పంపిణిదారులు, సినిమా థియేటర్ల యాజమాన్యం సినిమా విడుదల చేసే విషయంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని, ఈ సందర్బంలో తాము నేరుగా సినిమా విడుదలను నిషేదించలేమని  అంటున్నారు.

Related Posts