YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వ్యవసాయానికి సాయమెలా...

వ్యవసాయానికి సాయమెలా...

హైదరాబాద్, మే 22,
ఈ సారి రుతుపవనాలు ముందస్తుగా పలకరిస్తాయని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఇక రైతులంతా సంబురాలు చేసుకుంటున్నారు. గత పాలకుల మాటలు నమ్మి వ్యసాయాన్ని ఆగం చేసుకున్న రైతాంగం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ పై గంపెడాశలు పెట్టుకుంది. రైతు బంధు, రైతు రుణమాఫీ అంటూ ప్రకటనలకే పరిమితమైన నాటి బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వ్యవసాయం కొరకరాని కొయ్యగా మారిపోయింది. తెలంగాణలో వ్యవసాయం అంటేనే పట్టింపు లేకుండా పోయింది. ముఖ్యంగా కేసీఆర్ పదవి దిగే ముందు మూడు సంవత్సరాలలో రైతులు మరింతగా ఆగం అయ్యారు. ఈ మూడేళ్లుగా ప్రతి సీజన్ లో న్యూస్ పేపర్లలో పెద్ద ప్రకటనలు ఇచ్చి చేతులు దులిపేసుకోవడం తప్ప రైతులకు చేసిందేమీ లేదని నాటి కాంగ్రెస్ విమర్శిస్తూ వచ్చింది. పైగా రైతులు పండించిన పంటను కేంద్రమే కొనాలంటూ రైతులకు అందని సాయం అంతా కేంద్రం తీరుతోనే అని తెలివిగా కేంద్రం మీద నెట్టేసి చేతులు దులిపేుకున్నారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రతి వర్షాకాలం సీజన్ లో ప్రభుత్వమే రైతులకు ఈ పంటలు వేసుకోమని, ఆ పంటలు వేసుకోమని చెప్పి తీరా నష్టం వస్తే పట్టించుకోకుండా ఢిల్లీ స్థాయిలో రైతు దీక్షలు చేపట్టి వచ్చారు కేసీఆర్. అయినా కేంద్రాన్ని ఒప్పించలేకపోయారుఅప్పట్లో దొడ్లు వడ్లు పండించవద్దని రైతులకు చెప్పింది బీఆర్ఎస్ సర్కార్. అయితే సన్నవడ్లు పండించిన రైతులకు కనీసం మద్దతు ధరనైనా ఇప్పించలేక చేతులెత్తేసింది. ఇంకోసారి వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా పప్పులు, నూనె గింజలు సాగు చేయాలని చెప్పింది. అక్కడిదాకా బాగానే ఉంది. అందుకు అవసరమైన విత్తనాలు తెప్పించలేకపోయింది బీఆర్ఎస్. అయినప్పటికీ నాటి సర్కార్ మాటలు నమ్మిన రైతులు పప్పులు, నూనెగింజలు, పండ్లు, కూరగాయలు సాగుచేశారు. మళ్లీ ఎప్పటిలాగానే వాళ్లను మార్కెటింగ్ సమస్య వెంటాడింది. బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మి మోసపోయిన రైతాంగం మళ్లీ వరి పండించే దిశగా అడుగులు వేశారు. పైగా ముందస్తు సాగు అంటూ ఓ సరికొత్త ప్రతిపాదన చేసింది బీఆర్ఎస్ సర్కార్. కానీ వర్షాలు ఆలస్యంగా రావడంతో కనీసం రైతులు నార్లు పోసుకునేందుకు ప్రాజెక్టులనుంచి నీళ్లు ఇవ్వకపోవడంతో ముందస్తు ప్రతిపాదన కూడా బెడిసికొట్టింది.2021 వానకాలంలో సన్నాల సాగు పెంచాలనే లక్ష్యంతో దొడ్డు రకం వడ్ల సాగుపై రాష్ట్ర సర్కారు ఆంక్షలు విధించింది. సన్నాలు అధికంగా పండిస్తే క్వింటాకు అదనంగా రూ.100 చొప్పున చెల్లిస్తామని నాటి సీఎం కేసీఆర్ స్వయంగా ప్రటించారు. దొడ్డు రకం విత్తనాల సప్లై కూడా తగ్గించడం, మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గరనుంచి కలెక్టర్లు, ఏఈవోల దాకా ప్రచారం చేయడంతో ఆ ఏడాది రైతులు24 లక్షల ఎకరాల్లో సన్నరకాలు సాగు చేశారు. కానీ దొడ్డురకాలతో పోల్చినప్పుడు సన్నరకాలకు చీడపీడలు ఎక్కువ కావడంతో పెట్టుబడులు పెరిగాయి. తీరా దొడ్డు వడ్లతో పోల్చినప్పుడు ప్రతి ఎకరాకు 5 క్వింటాళ్ల దిగుబడి తగ్గిపోయింది. దీనితో సన్నవడ్లకు క్వింటాల్ కు రూ.400 నుంచి రూ.500 వరకూ అధికంగా చెల్లించాలని రైతులు డిమాండ్ చే రూ. 100 ఎక్కవ ఇస్తామని చెప్పిన నాటి సీఎం కేసీఆర్ ఆ హామీని సైతం నిబెట్టుకోలేకపోయారు. దీంతో రైతులు ఎప్పట్లాగే దొడ్డు వడ్లకు మొగ్గుచూపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క కంది తప్ప మిగిలిన మెట్ట పంటలు సగటు విస్తీర్ణం కంటే తగ్గిపోతూవస్తున్నాయి. ఒకప్పుడు సగటున 5 లక్షల ఎకరాల్లో సాగయ్యే పల్లి 40 వేల ఎకరాలకు, 3.75లక్షల ఎకరాల్లో సాగయ్యే పెసర 2 లక్షల ఎకరాలకు, 7.5లక్షల ఎకరాల్లో సాగయ్యే సోయాబీన్ 1.5 లక్షల ఎకరాలకు పరిమితయ్యాయి. ఇక మక్క మీద గత సర్కారు కత్తి గట్టింది. మక్కలను కొనేది లేదని చెప్పడంతో ఒకప్పుడు14 లక్షల ఎకరాల్లో సాగయ్యే మక్క సగానికి సగం తగ్గిపోయింది. ఇక మిర్చి 2 లక్షల ఎకరాల్లో, కూరగాయలు లక్ష ఎకరాల్లో, అన్ని రకాల పండ్ల తోటలు కలిపి 5 లక్షల ఎకరాలకే పరిమితయ్యాయి2023లో ఎంతో ఆర్భాటంగా కేసీఆర్ సర్కార్ ‘పెట్టుబడి తగ్గాలే..దిగుబడి పెంచాలే’ అంటూ ఓ ఆకర్షణీయ క్యాప్షన్ తో వచ్చింది. దీని కోసం నాటి వ్యవసాయశాఖ మంత్రి పలువురు ఎమ్మెల్యేలు విదేశాలకు వెళ్లి మరీ అధ్యయనం చేసి వచ్చారు. ప్రతి క్లస్టర్ లో 400 ఎకరాలలో డైరెక్ట్ సీడింగ్ పద్ధతిలో వరిని ప్రతి జిల్లాలో 5 వేల ఎకరాలలో హైడెన్సిటీ కాటన్ సాగుచేయాలని నిర్ణయించారు. దీనివల్ల కూలీల ఖర్చు, విత్తనాలు, ఎరువుల వాడకం తగ్గి రైతులకు పెట్టబడి ఖర్చులు భారీగా అవుతాయని ఊదరగొట్టేశారు. అయితే హైడెన్సిటీ ప్లాంటింగ్ విధానం ఆచరణలో విఫలం అయింది. పైగా ఫీల్డ్ లెవెల్ లో రైతులకు ఈ విధానంపై అవగాహన కల్పించడం, సమీకరించడంలో వ్యసాయ శాఖ ఫెయిలయింది. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కాంగ్రెస్ సర్కార్ వ్యవసాయంపై దృష్టి సారించి, రైతులకు పంట సాయం అందించి వారు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తుందనే ఆశతో ఉన్నారు రైతులు

Related Posts