YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జడ్చర్ల ఛైర్మన్ కు పదవీ గండం

జడ్చర్ల  ఛైర్మన్ కు పదవీ గండం

మహబూబ్ నగర్, మే 22
మహబూబ్‎నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మికి పదవీ గండం నెలకొంది. సొంత పార్టీ కౌన్సిలర్లే ఆమెపై అవిశ్వాసానికి సిద్ధం అయ్యారు. అయితే చైర్మన్‎తో పాటే వైస్ చైర్మన్‎పై కూడా అవిశ్వాసం తీర్మానం పెట్టాలని భావించినా అనివార్య కారణాల దృష్ట్యా ఉపసంహరించుకున్నారు. చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఇద్దరు మహిళలే ఉండడంతో ప్రోటోకాల్‎కే పరిమితం అవుతున్నారని అసంతృప్త కౌన్సిలర్ల చెబుతున్నారు. పాలనాపరమైన నిర్ణయాల్లో ఆలస్యం, ప్రజా సమస్యల పరిష్కారం జరగడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో మెజార్టీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే అవిశ్వాసానికి సంబంధించిన ఒక అడుగు ముందుకు పడే అవకాశం ఉంది. జడ్చర్ల మున్సిపాలిటీ లో మొత్తం 27 మంది కౌనిలర్లు ఉన్నారు. మొదట్లో బీఆర్ఎస్‎కు 23మంది కౌన్సిలర్లు ఉండగా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇప్పటికీ మెజారిటీ కౌన్సిలర్ల మద్దతు బీఅర్ఎస్ పార్టీకేఉంది. ఇటీవలే సమావేశమైన 19మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికే మొగ్గు చూపారు. త్వరలోనే జిల్లా కలెక్టర్‎ను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చే యోచనలో ఉన్నారు.మాజీ మంత్రి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అనుమతి కోసం అసంతృప్త కౌన్సిలర్లు వేచి చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందే ఈ అంశం తెరపైకి వచ్చినప్పటికి నాడు లక్ష్మారెడ్డి ఒప్పుకోలేదని తెలిసింది. అయితే పరిస్థితుల్లో మార్పు కనిపించకపోవడంతో మరోమారు అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తెచ్చారు కౌన్సిలర్లు. ప్రస్తుతం లక్ష్మారెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన కోసమే తీర్మానాన్ని పెండింగ్‎లో పెట్టారని పార్టీ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ అంశంపై స్పష్టత తీసుకొని చైర్మన్‎ని మారుస్తామని అసంతృప్త కౌన్సిలర్లు చెబుతున్నారు.

Related Posts