మాచర్ల
ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. పాల్వయి గ్రామంలో పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం, తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీ కి ఆదేశాలు ఇచ్చింది. దాంతో పోలీసులు బృందాలుగా విడిపోయి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కోసం గాలిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని ఏ క్షణం అయినా అరెస్ట్ చేసే అవకాశం వుంది.