YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

టాప్ పొజిషన్ లో ఎయిర్ టెల్

 టాప్ పొజిషన్ లో ఎయిర్ టెల్

రిలయెన్స్ జియో ఎన్ని సంచలనాలు సృష్టిస్తూ వినియోగదారులను తనవైపు ఆకర్షిస్తోన్న.. దిగ్గజ టెలికాం సంస్థ 'ఎయిర్‌టెల్'కే వినియోగదారులు పట్టం కట్టారు. ఈ మేరకు సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా విడుదలచేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఎక్కువమంది కస్టమర్లు ఉన్న నెట్‌వర్క్‌గా నిలవడంతోపాటు, మార్కెట్‌ షేర్‌లోను ఎయిర్‌టెల్‌ తొలి స్థానంలో కొనసాగుతోంది. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే ఎయిర్‌టెల్‌కు 45 లక్షల మంది కొత్త కస్టమర్లు వచ్చి చేరారు. దీంతో ఎయిర్‌టెల్ మొత్తం వినియోగదారుల సంఖ్య 308.6 మిలియన్లకు చేరింది. ఎయిర్‌టెల్ తర్వాతి స్థానంలో 222.03 మిలియన్ల కస్టమర్లతో వొడాఫోన్ నిలిచింది. ఏప్రిల్‌ నెలలో వొడాఫోన్‌ 6.6 లక్షల కస్టమర్లను కోల్పోయినప్పటికీ రెండో స్థానంలో నిలవడం విశేషం. ఇక ఐడియాకు 216.76 మిలియన్లు, ఎయిర్‌సెల్‌ 74.15మిలియన్లు, టెలినార్‌ 37.98మిలియన్లు, ఎంటీఎన్‌ఎల్‌ 3.56 మిలియన్ల మంది యూజర్లు ఉన్నట్లు నివేదికలో తేలింది. మరోవైపు సంచలన టెలికామ్ దిగ్జజం జియో 186.56 మంది చందాదారులతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఐడియా, వొడాఫోన్ విలీనమైతే మాత్రం ఎయిర్‌టెల్ రెండో స్థానానికి పడిపోవాల్సి వస్తుంది. ఇక మార్కెట్‌ షేర్‌లో ఎయిర్‌టెల్‌ 29.41శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. వొడాఫోన్‌ 21.15శాతంతో రెండో స్థానంలో ఉన్నట్లు సీఓఏఐ వెల్లడించింది. ఐడియా 20.65శాతం మార్కెట్‌ షేర్‌తో మూడో స్థానంలో ఉండగా..జియో 17.77శాతంతో తర్వాతి స్థానంలో ఉంది.

Related Posts