YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేటీఆర్ ఫ్రస్టేషన్ లో వున్నారు మంత్రి కోమటిరెడ్డి

కేటీఆర్ ఫ్రస్టేషన్ లో వున్నారు మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ బూస్తాపితం అవుతుంది. కవిత జైలు కు వెల్లిందని , తమ ప్రభుత్వం పోయిందనే ఫ్రస్టేషన్ లో కేటీఆర్ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ మాటలు అసహ్యం గా ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినందుకు,30 వేల ఉధ్యోగ నియామకాలు చేపట్టినందుకా రేవంత్ రెడ్డి ని కేటీఆర్ తిడుతున్నాడా. దర్గం చెరువు పై కేబుల్ బ్రిడ్జి కట్టి అబివృద్ది చేసామని చెప్తున్నారు. ఎయిర్పోట్ , పీవి ఎక్స్ ప్రెస్ వే లాంటివి కట్టిన మేమేమనాలి. ఐఎఎస్ లను అందరినీ  పక్కన పెట్టి నాలుగు ఐఎఎస్ లను కేటీఆర్ ఎంకరేజ్ చేసారు. ఉధ్యమకారుడు కేకే మహెందర్ రెడ్డి ని బీఆర్ఎస్ నుంచి వెల్లగొట్టిందే కేటీఆర్ అని అయన అన్నారు.
12 కుతగ్గకుండా మాకు ఎంపీ లు వస్తాయి. బీఆర్ఎస్ కు రెండు, మూడు చోట్ల డిపాజిట్ వస్తే ఎక్కువ. కేంద్రం ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. బీఆర్ఎస్ హాయాంలో మద్యం అమ్మాకాలు పెరిగాయి తప్ప అభివృద్ధి జరగలేదు. వైన్ షాపుల పేరు మీద 2500 కోట్లు గత ప్రభుత్వం రాబట్టింది. టెడ్ కు 2 వేలు పెడితే మమ్మల్ని కేటీఆర్ విమర్శిస్తున్నాడు. పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పాం. దోడ్డు వడ్ల కు ఇవ్వమని మేము ఎక్కడా  చెప్పలేదని అన్నారు. వచ్చే నెల 6,7,8 నేను ,శ్రీధర్ బాబు విదేశీ పర్యటనకు వెల్తున్నాం..వివిధ కంపెనీల తో భేటి అవుతాం. కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు తలెత్తుకోలేకపోతున్నారు..మేము ఇతర రాష్ట్రాలకు వెల్లలేకపోతున్నాం. ఎల్బీనగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 14 అంతస్థుల కు కుదిస్తాం. మల్లన్న మీద కేసులు ఉన్నారు అంటున్న కేటీఆర్.. కవిత కేసు గురించి ఎందుకు మాట్లాడడం లేదు. బీజేపీ ఫోర్ లీడర్ అయి నెల రోజులు కానీ వ్యక్తి.. ఆర్టీఐ కింద 70 లెటర్ లు పెట్టాడు. సీనియర్ నేత రాజాసింగ్ కు కాదని ఎల్పీ పదవి తీసుకున్నాడు.. ఆయన పేరు చెప్పాలంటేనే నాకు ఇన్సంల్ట్ గా ఉంది. సీఎం, ఉత్తమ్ కుమార్ రెడ్డి పై బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండానే బీఆర్ఎస్ ఆఫీసు లు కట్టారు. జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ నేతలు అంతా కేఏ పాల్ లా తిరగాల్సిందే. వైఎస్సార్ తరహాలో రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంన్నారని అన్నారు.

Related Posts