YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలో ఖుషీ...

టీడీపీలో  ఖుషీ...

విశాఖపట్టణం, మే 25
సాధారణంగా ఎన్నికల అన్నాక గెలుపోటములు ఉంటాయి. అయితే ఓడిపోయినప్పుడు మాత్రం ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. ప్రతిపక్షంగా తమ పాత్ర పోషిస్తాం అన్న ప్రకటన చేస్తారు. అయితే పోలింగ్ తర్వాత, కౌంటింగ్ కు ముందు వచ్చే ప్రకటనలు బట్టి గెలుపోటములపై ఒక నిర్ణయానికి రావచ్చు. గత ఎన్నికల సమయంలో పోలింగ్లో అవకతవకలు జరిగాయని.. రిగ్గింగులు చేశారని.. రీ పోలింగ్ నిర్వహించాలని అప్పటి అధికారపక్షం టిడిపి నుంచి డిమాండ్లు వచ్చాయి. ఎలక్షన్ కమిషన్ కు వినతులు వెల్లువెత్తాయి. న్యాయస్థానాన్ని ఆశ్రయించే వరకు పరిస్థితి వచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఓటమి సాకుల కోసమే అప్పట్లో టిడిపి అలా చేసిందని వైసిపి ఎంజాయ్ చేసింది. కానీ ఈ ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతోంది. ఎన్నికల్లో అవకతవకలపై వైసీపీ గగ్గోలు పెడుతోంది. టిడిపి ఎంజాయ్ చేస్తోంది.మాచర్లలో రిగ్గింగ్ జరిగిందని.. దానికి అడ్డుకట్ట వేసేందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రయత్నించారని.. అందులో భాగంగానే ఈవీఎంలను ధ్వంసం చేశారని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పోస్టులు పెట్టారు. వైరల్ చేశారు. ఇక పిన్నెల్లికి ముందస్తు బెయిల్ లభించడంతో.. అప్పటివరకు దాక్కున్న వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదులు చేశారు. మాచర్ల నియోజకవర్గంలో రిగ్గింగ్లు జరిగాయని.. రీపోలింగ్ నిర్వహించాలని కోరారు. దీంతో టిడిపి నేతలు ఖుషి అవుతున్నారు. వైసీపీ నేతలు ఓటమిని ఒప్పుకున్నట్టు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సత్తెనపల్లిలో చాలా కేంద్రాల్లో టిడిపి రిగ్గింగ్ చేసిందని సాక్షాత్ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అందుకే అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ ని కోరారు. అంతటితో ఆగకుండా హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు పిటీషన్ ను కొట్టివేసింది. నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అయితే.. విదేశాల నుంచి సాక్షి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అవకతవకలపై ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని కూడా అదే తరహా ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ నాయకులంతా ఇదే తరహా మాటలు చెబుతుండడంతో.. ఓటమి సాకులు అంటూ టిడిపి ఖుషి అవుతోంది.
బలైన అధికారులు
మనదేశంలో వ్యవస్థలు ఎంత బలహీనమో.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎపిసోడ్ ఒక బలమైన ఉదాహరణ. పోలింగ్ నాడు జరిగిన విధ్వంసం.. తరువాత కూడా కొనసాగింది. దీనిపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు వెళ్లాయి. ఈసీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తో పాటు ఆయన సోదరుడిని హౌస్ అరెస్టు చేయాలని ఆదేశించింది. కానీ హౌస్ అరెస్ట్ నుంచి ఎమ్మెల్యే సోదరులు తప్పించుకున్నారు. అంటే వ్యవస్థ వారికి సహకరించినట్టే కదా. ఇప్పుడు ఏకంగా ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసినట్లు వీడియో బయటకు వచ్చింది. అల్లర్ల పై ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో భాగంగా ఆ వీడియోలు బయటకు వచ్చాయి. తక్షణం అరెస్టు చేయాలన్న ఈసీ ఆదేశాలు సైతం అమలు చేయడంలో వ్యవస్థ లోపాలు బయటపడ్డాయి. అదిగో అరెస్ట్.. ఇదిగో అరెస్ట్ అంటూ కాలయాపన జరిగింది. చివరకు పిన్నెల్లి హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ దక్కించుకునే వరకు సహకారం అందింది.పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నారు అడిగితే అధికారులకు తెలియదు. ఆయన కదలికలు తెలియవు. ఒక ఎస్పీతోపాటు ఎనిమిది మంది డిఎస్పీల పర్యవేక్షణలో 8 బృందాలు పిన్నెల్లి గురించి తిరిగినా పట్టుబడలేదంటే.. వ్యవస్థల పరంగా ఆయనకు ఎంతలా సహకారం అందిందో అర్థమవుతోంది. కానీపిన్నెల్లి లోపలకు బలవంతంగా దూరి విధ్వంసానికి పాల్పడినందుకు.. అక్కడ పోలింగ్ ఆఫీసర్ను, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు. అలా తమ ఆగ్రహాన్ని వారిపై చూపించగలిగారు.అంతకంటే వారు ఏం చేయగలరు. గత ఐదేళ్లుగా మాచర్లలో పిన్నెల్లి రౌడీలా వ్యవహరించారు. ఇప్పుడు పరారైన ఖైదీగా మారారు.వ్యవస్థలే కాదు అధికార పార్టీ సైతం పిన్నెల్లికి అండగా నిలిచింది. అసలు ఆ వీడియో తీసింది ఎవరు? బయట పెట్టింది ఎవరు? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అది ఫేక్ అని తేల్చేస్తున్నారు. అంతటితో ఆగకుండా టిడిపి నేతలు ధ్వంసం చేసిన ఈవీఎంల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంటే పది రోజుల తరువాత.. పిన్నెల్లి విధ్వంస ఘటన బయటపడిన తరువాత.. వైసీపీ నేతలు ఈ సరికొత్త సందేహాలను బయటపెడుతున్నారంటే వారి మానసిక స్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దొంగే దొంగ అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. విధ్వంసానికి పాల్పడిన పిన్నెల్లి ఎక్కడ అంటే అధికారులు సమాధానం చెప్పడం లేదు. కానీ ఆ పోలింగ్ కేంద్రానికి బాధ్యత వహించిన సిబ్బందిపై చర్యలకు వెనుకడుగు వేయలేదు. ఇక్కడే తెలిసిపోతోంది అసలు సిసలు విషయం.

Related Posts