YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దర్జాగా దొంగతనం…సిసి ఫూటేజ్ లో రికార్డు

దర్జాగా దొంగతనం…సిసి ఫూటేజ్ లో రికార్డు

గుత్తి
గుత్తి పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఉన్న సబిహా స్టీల్ అండ్ ఐరన్ ట్రేడర్స్ షాపులో దొంగ చొరబడ్డాడు.   లాకర్ లో ఉంచిన రూ. 33 వేలు నగదు , సెల్ ఫోన్ అపహరించాడు.  ఈ చోరీ దృశ్యాలన్నీ సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. పాపం దొంగకు సిసి ఫుటేజ్ ఉందని గ్రహించలేదేమో ఎంచక్కా నిద్రపోయేవాడిలా నటించి తన వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో షటర్ తాళాలను ధ్వంసం చేశాడు. తరువాత లోనికి ప్రవేశించి దర్జాగా కుర్చీలో కూర్చుని పాపం లైట్లు వేసుకోవడానికి స్విచ్లు ఎక్కడున్నాయో తెలియదేమో తన వెంట తెచ్చుకున్న అగ్గిపెట్ట బయటకు తీశాడు అగ్గిపుల్ల వెలిగించి లాకర్ ఓపెన్ చేసి పరిశీలించాడు. అందులో ఉంచిన రూ.33వేలు  నగదు తీసుకొని జోబులో పెట్టుకున్నాడు.  అంతటితో ఆగలేదు వెళ్తూ వెళ్తూ టేబుల్ పై ఉన్న సెల్ ఫోను వెంట తీసుకెళ్లాడు.  ఈ దృశ్యాలన్నీ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన సంగతి దొంగకు తెలియదేమో.  ఉదయం షాప్ కొచ్చిన యజమాని మైను షాపుకు వచ్చి గమనించగా తాళాలు ఓపెన్ చేసి ఉండడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. - లాకర్ లో ఉన్న డబ్బు లేకపోవడంతో చోరీ జరిగినట్టు భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.  విషయం తెలుసుకున్న గుత్తి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి సీసీ  ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు.

Related Posts