YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పరుగులు పెడుతున్న పోలవరం 9 వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం

పరుగులు పెడుతున్న పోలవరం 9 వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం

మాకు హక్కుగా రావాల్సిన దాని కోసం పోరాడతాం... మాకు రావాల్సింది రాలేదని, బాధ పడుతూ కూర్చోం... మాకు ఉన్న వనరులతో, మా ప్రజలకి కష్టం లేకుండా చేస్తా... అదే విధంగా, మాకు హక్కుగా రావాల్సిన దాని కోసం పోరాటం చేస్తాం... ఇది చంద్రబాబు గత కొన్ని రోజులుగా చెప్తున్న మాట.. పోలవరం ప్రాజెక్ట్, జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించామని, 100 శాతం మేమే డబ్బులు ఇస్తాం అంటుంది కేంద్రం.. కాని ఆరు నెలల నుంచి, ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఇవ్వలేదు... ఎందుకో తెలుసా ? ఈ ఆరు నెలల కాలమే ప్రాజెక్ట్ అతి వేగంగా కట్టే కాలం... వర్షాలు పడితే మళ్ళీ పనులు మందగిస్తాయి.. అందుకే మనల్ని ఇబ్బంది పెట్టటానికి ఈ ప్లాన్ వేసారు... కాని వీరి కుట్రలు ముందే ఊహించిన చంద్రబాబు, దాదాపు 9 వేల కోట్లు ఈ ఏడు మన రాష్ట్ర బడ్జెట్ లో పోలవరం కోసం పెట్టారు... మన డబ్బులే వాడుతూ, పనులు పరుగులు పెట్టించారు.. తద్వారా, టార్గెట్ కి తగ్గట్టు, పనులు పరిగెత్తించారు..ఇప్పుడు మనమే దాబ్బులు ఖర్చు పెడుతున్నాం... కేంద్రం మాత్రం, 6 నెలలుగా రూపాయి ఇవ్వలేదు... దీని వల్ల మనకు వడ్డీ నష్టం.... వడ్డీ సంగతి తరువాత, అసలు కూడా ఇస్తారో లేదో కూడా తెలీదు... ఇలాంటి పరిస్థితుల్లో పోలవరం పనులు పరుగులు పెట్టాయి... రాష్ట్రప్రభుత్వ సొంత ఖర్చుతో మరో వారంలోపు అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తికాబోతోంది. దేశంలో అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టుల్లో ఒకటైన పోలవరంలో పూర్తికాబోతున్న తొలి నిర్మాణం ఇది. డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులు 95శాతం పూర్తయ్యాయి. ఈ నెల పదో తేదీ లోపు మిగతా ఐదు శాతాన్ని అలవోకగా పూర్తిచేసేందుకు లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. దీనికి సమాంతరంగా కీలకమైన కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులూ శరవేగంగా జరుగుతున్నాయి...పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నిర్మాణాల్లో ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం ఒకటి. ఈ నిర్మాణం పూర్తయితే ప్రాజెక్టు పూర్తయినట్లే. ఈ డ్యాం నిర్మాణ పనులు చేపట్టాలంటే దానికి ముందుగా నదీగర్భంలో నిర్మించేదే డయాఫ్రంవాల్‌.ఇందుకు అధునాతన టెక్నాలజీని ఉపయోగించి డయాఫ్రం వాల్‌ నిర్మించాలి. ప్రపంచంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో ఇలాంటి టెక్నాలజీని ఒకటి, రెండు చోట్లే వినియోగిస్తున్నారు. ఆ టెక్నాలజీతోనే పోలవరంలోనూ డయాఫ్రంవాల్‌ నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. 1500 మీటర్ల పొడవున రెండు దశల్లో నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యం విధించింది. మొదటిదశలో ప్రాజెక్టు కుడివైపున 800 మీటర్ల నిడివితో, రెండోదశలో ఎడమవైపున 700 మీటర్ల పొడవున నిర్మించాలని నిశ్చయించింది. 2018 జూన్‌ 10లోపు ఈ పనులు పూర్తిచేసే లక్ష్యంతో ఈ బాధ్యతను బావర్‌ కంపెనీకి అప్పగించారు. ప్రస్తుతానికి వాల్‌ నిర్మాణంలో మరో 25 మీటర్లు (ఐదుశాతం) మాత్రమే పూర్తిచేయాల్సి ఉంది.పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి 2019కల్లా గ్రావిటీ ద్వారా రైతులకు నీరు అందించి తీరతామని ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు. మొత్తం పోలవరం పనుల్లో ఇప్పటికి పూర్తయింది 54 శాతమే అయినా.. ఏడాదిలోపే మిగతా పనులపై దృష్టిపెట్టి.. గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వగలమని ఇంజనీరింగ్‌ అధికారులు అంటున్నారు. 

Related Posts