YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం

వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం

విశాఖపట్నం
ఎండలు మండిపోతున్న వేళ విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం చల్లటి కబురు చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది క్రమంగా బలపడి తీవ్రవాయుగుండంగా ఆ తర్వాత తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఈశాన్య దిశగా పయనిస్తుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. ఇది క్రమంగా బలపడి తుపానుగా ఈనెల 26వ తేదీ రాత్రికి బర్మా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుపాను ప్రభావంతో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో పలుచోట్ల సాధారణం నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పెద్దగా ఉండదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. కాగా ప్రస్తుతం ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా చెదురు మదురుగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో మిగతా జిల్లాలలో ఎండల తీవ్రత కొనసాగుతోందని, రెండు రోజుల తర్వాత పొడిగాలుల తీవ్రత కూడా ఉంటుందని హెచ్చరించింది. ప్రస్తుతం అన్ని పోర్టులకు ఒకటో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారిణి సునంద వెల్లడించారు.

Related Posts