ఉత్తరాఖండ్ మే 25
చార్ధామ్ యాత్రను చేపట్టాలనుకునే యాత్రికులందరు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకొవలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది ఈ రిజిస్ట్రేషన్ ద్వారా చార్ ధామ్ తీర్థయాత్రను క్రమబద్ధీకరించేందుకు తోడ్పడుతాయి భక్తుల భద్రత సులబతరం చేసేందుకు తోడ్పడుతుందని. ఉత్తరఖాండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి. రాధా రాటురి ఒక ప్రకటనలో తెలియచేశారు. 1*తప్పనిసరి నమోదు అమలు: చార్‌ధామ్ యాత్ర కోసం వెళ్ళేయాత్రికులు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలని సూచించారు రిజిస్ట్రేషన్ చేసుకోని భక్తులు చారధామ్ దర్శించడానికి ప్రయత్నించవద్దని సూచించారు.యాత్రకు రిజిస్ట్రేన్ చేసుకోని భక్తులను నిర్ణీత చెక్‌పాయింట్ వద్ద ఆపివేయబడతారని మరియు సరైన రిజిస్ట్రేషన్ లేకుంటె భక్తులను అనుమతించబడదని సూచించారు. 2 * నమోదు తేదీలకు కట్టుబడి ఉండటం: యాత్రికులు తాము నమోదు చేసుకున్న నిర్దిష్ట తేదీలకు కట్టుబడి ఉండాలని. ఇది సందర్శకుల తాకిడిని ధామ్‌ల వద్ద క్రమాన్ని నిర్వహించడానికి సహాయపడుతుందిని, సూచించారు.3* టూర్ ఆపరేటర్లు మరియు ట్రావెల్ ఏజెంట్ల బాధ్యత: అన్ని టూర్ ఆపరేటర్లు మరియు ట్రావెల్ ఏజెంట్లు తమ క్లయింట్లు ప్రయాణాన్ని ప్రారంభించే ముందు అవసరమైన రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసేందుకు సహకరించాలని దిని వలన యాత్ర సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాం జరగకుండ చూసేందుకు తోడ్పడుతుందని ఒక ప్రకటనలో తెలిపారు.