గుంటూరు, మే 27
ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరిగిన ఎన్నికల్లో చాలా ఆసక్తికరమైన కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పోస్టల్ బ్యాలెట్‌లు రావడం అశ్చర్యపరిచింది. గతానికి కంటే ఈసారి రెట్టింపు సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికారులకు చేరాయి. అయితే ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం అందులో ఎన్ని వ్యాలీడ్ అవుతాయో ఎన్ని చెల్లకుండా పోతాయో అన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చాలా నమోదు అయ్యాయి. 5 లక్షల 40 వేల పోస్టల్ బ్యాలెట్లు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. 2019 ఎన్నికల్లో 2,95,003 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఇప్పుడు అది రెట్టింపు సంఖ్యలో వచ్చింది. జిల్లాల వారీగా పోస్టల్ బ్యాలెట్ పోలైన ఓట్లు చూస్తే.. అత్యధిక ఓట్లు శ్రీకాకుళం జిల్లాలో పడ్డాయి. అక్కడ 38,865 మంది ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. తర్వాత నంద్యాల జిల్లాలో 25 వేల 283 మంది, కడప జిల్లాలో 24వేల 918 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే విధాన్ని వినియోగించుకున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గం పేరు పోలైన పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపునకు ఏర్పాటు చేసిన టేబుల్స్ ఒక టేబుల్‌కు వచ్చే ఓట్లు
1 శ్రీకాకుళం జిల్లా 38865 50 778
2 విజయనగరం జిల్లా 21462 30 716
3 అరకు 21462 20 1074
4 విశాఖ జిల్లా 25681 18 1427
5 అనకాపల్లి జిల్లా 22772 14 1627
6 కాకినాడ జిల్లా 18470 14 1320
7 అమలాపురం 17350 15 1157
8 రాజమండ్రి 15684 18 872
9 నర్సాపురం 15320 15 1022
10 ఏలూరు 17519 14 1252
11 మచిలీపట్నం 21579 14 1542
12 విజయవాడ 17713 14 1266
13 గుంటూరు 24036 14 1717
14 నరసారావుపేట 19027 18 1058
15 బాపట్ల 23847 16 1491
16 ఒంగోలు 23442 41 572
17 నంద్యాల 25283 17 1488
18 కర్నూలు 17200 14 1780
19 అనంతపురం 22546 20 1128
20 కడప 24918 14 1780
21 నెల్లూరు 24809 18 1379
22 తిరుపతి 19503 15 1301
23 రాజంపేట 21557 20 1078
24 చిత్తూరు 22957 18 1276
25 హిందూపురం 16187 18 900
ఎన్నికల విధుల్లో ఉన్న వారు ఈ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. వారితోపాటు తొలిసారిగా ప్రవేశ పెట్టిన హోమ్ ఓటింగ్ విధానంలో 13,700 మంది 85 ఏళ్లు దాటిన ముసలివాళ్లు, 12,700 మంది దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా పెరిగిపోయాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రావడంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతి పోస్టల్ బ్యాలెట్‌ను అక్కడ ఉన్న అభ్యర్థి ఏజెంట్లకు చూపించి అనంతరం అతి చెల్లుతుందా లేదా అని తేల్చాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ కవర్ A తోపాటు ఓటర్ డిక్లరేషన్ ఫామ్ విడిగా ఉంటే ఆ ఓటు చెల్లకుండా పోతుంది. గెజిటెడ్ సంతకం లేకపోయినా ఓటు చెల్లదు. పోస్టల్ బ్యాలెట్ వెనుక ఆర్‌వో సంతకం ఉండాలి. అయితే ఈసారికి దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఈసీకి రిక్వస్ట్ పెట్టింది. ముఖేష్‌కుమార్ మీనా మౌఖికంగా ఓకే చెప్పిన ఇంత వరకు అధికారిక ఉత్తర్వులు రాలేదని టీడీపీ చెబుతోంది.
ఇలాంటి రూల్స్‌లో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా అలాంటి ఓట్లు చెల్లకుండా పోతాయి. 2019 ఎన్నికల్లో 56 వేలకుపైగా ఓట్లు చెల్లకుండా పోయాయి. అంటే 20 శాతానికిపైగా ఓట్లు పనికిరాకుండా పోయాయి. ఈసారి కూడా ఎన్ని చెల్లకుండా పోతాయో అన్న అనుమానం ఉంది. ఈ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాతే ఈవీఎంలను