YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వరంగల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ గురి

వరంగల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ గురి

వరంగల్, మే 27,
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌పై గురి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు వన్‌ బై వన్‌ హస్తం గూటికి క్యూ కడుతున్నారు. ఏకంగా ఓరుగల్లు మేయర్ కూడా అదే రూట్‌లో ఉన్నారన్న ప్రచారంతో అలర్ట్‌ అవుతోంది గులాబీ పార్టీ. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ లిస్టులో ఇంకా ఎంతమందున్నారు? గ్రేటర్‌ కుర్చీకి కాంగ్రెస్‌ ఎంత దూరంలో ఉంది? కుర్చీలాటలో బీఆర్‌ఎస్‌ పట్టు నిలుస్తుందా? కాంగ్రెస్‌ ఎత్తు ఫలిస్తుందా? ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ.పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి.. కానీ వరంగల్ లో మాత్రం పొలిటికల్ హీట్ చల్ల బడడం లేదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అవిశ్వాసం తీర్మానంపై హాట్ హాట్ చర్చ జరుగుతుంది. మేయర్ కుర్చీలో కూర్చోబెట్టిన వారే ఇప్పుడు కుర్చీ దింపడానికి కసరత్తు చేస్తున్నారట. ఓరుగల్లు మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు, కార్పొరేటర్లు మేయర్ గుండు సుధారాణి పై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు, కార్పొరేటర్లు భేటీ అయి మేయర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టే విషయంపై చర్చ జరిపారు. వారికి కలిసివచ్చే పార్టీలు, ఇతర పార్టీల కార్పొరేటర్ల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారట..ఓరుగల్లు మేయర్ పై హటాత్తుగా ఎందుకు అవిశ్వాసం ప్రవేశపెట్టాలని కసరత్తు చేస్తున్నారు..? ఆమెను మేయర్ పీఠంపై కూర్చోబెట్టిన బీఆర్ఎస్ పార్టే ఇప్పుడు ఆమెను గద్దే దింపేందుకు ఎందుకు కసరత్తు చేస్తుందనే అనుమానం కలుగుతుంది కదూ..? అవునూ బీఆర్ఎస్ పార్టే మేయర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు ఉవ్విళ్ళూరుతోంద. ఆ పార్టీ నుండి గెలుపొంది గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠం కైవసం చేసుకున్న గుండు సుధారాణి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో మేయర్ పై ఆగ్రహంతో ఊగిపోతున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు అవిశ్వాసం ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైనట్లు చర్చ జరుగుతుంది. ఐతే ఎవరి బలమెంతా..? అవిశ్వాసం పెడితే తగ్గేదెవరూ..? నెగ్గేదేవరూ..? అనే చర్చ జరుగుతుంది.GWMCలో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కొత్త – పాత కార్పొరేటర్లతో కలుపుకుని కాంగ్రెస్ సభ్యుల సంఖ్యా బలం 34కు చేరింది. 10మంది బీజేపీ, 22 మంది బీఆర్ఎస్ సభ్యులుగా కొనసాగుతున్నారు. అలాగే బీఆర్ఎస్ తరుఫున నలుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు తెలిపితే మేయర్ కుర్చీకి ఎలాంటి ముప్పు ఉండదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చెందిన ఎనిమిది మంది కార్పొరేటర్లు మేయర్ పై గుర్రుగా ఉన్నారు. ఆ ఎనిమిది మంది బీఆర్ఎస్ పార్టీ పెట్టే అవిశ్వాసానికి మద్దతు తెలిపితే మేయర్ కుర్చీకి గండం తప్పేలా లేదు.ఈ నేపథ్యంలోనే మేయర్‌ను గద్దె దించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇవ్విళ్ళూరుతోంది. అయితే, సరిపడ సభ్యుల మద్దతు లేకుండా అవిశ్వాసం ప్రవేశపెడితే నెగ్గేదెవరూ..? అవిశ్వాసం వేగిపోతుందా..? లేదా కాంగ్రెస్ లోని ఒక వర్గం మద్దతుతో మేయర్ కుర్చీకి ఎసరు పెడతారా.? అనే చర్చ జరుగుతుంది.

Related Posts