YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అకడమిక్ క్యాలెండర్ రెడీ

అకడమిక్ క్యాలెండర్ రెడీ

హైదరాబాద్, మే 27,
వేసవి సెలవులు ముగుస్తున్నాయి. మరో రెండు వారాల్లో స్కూళ్లు తెరచుకోనున్నాయి. జూన్12 నుంచి స్కూళ్లు రీఓపెన్ చేయనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈ లోపు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. జూన్ 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ 11 రోజుల పాటు కార్యక్రమాన్ని జరపనున్నారు. అంతేకాదు.. 2024–25 అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌ను కూడా విద్యాశాఖ రిలీజ్ చేసింది.వచ్చే ఏడాది 229 రోజులు వర్కింగ్ డే‌స్ నిర్ణయించారు. అక్టోబర్ 2 నుంచి 13 (అక్టోబర్ 2 నుంచి 14 వరకు) రోజుల పాటు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి ఐదు రోజుల క్రిస్మస్ సెలవులు, జనవరి 13 నుంచి ఐదు రోజుల సంక్రాంతికి సెలవులు ఫిక్స్ చేశారు. ఇక ప్రతీ రోజూ స్టూడెంట్స్‌తో ఐదు నిమిషాలు యోగా, మెడిటేషన్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో పాటు.. ప్రతీ నెల మూడో శనివారం నో బ్యాగ్ డే అమలు చేయనున్నారు. నెలకు ఒక నో బ్యాగ్ డే చొప్పున ఏడాదికి 10 రోజులు అమలు చేస్తారు.ఇక జనవరి 10 నాటికి టెన్త్ సిలబస్ పూర్తి చేసేలా షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత విద్యార్థులకు ప్రిపరేషన్, రివిజన్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మిగిలిన క్లాసులకు ఫిబ్రవరి 28 నాటికి సిలబస్ కంప్లీట్ చేసేలా క్యాలెండర్ రిలీజ్ చేశారు. స్టూడెంట్స్ అటెండెన్స్ పడిపోకుండా టీచర్స్ జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది. ప్రతీ స్కూల్‌‌లోనూ 90 శాతం మందికిపైగా విద్యార్థులు హాజరు ఉండాలని స్పష్టం చేసింది. తరుచూ స్కూలుకు డుమ్మా కొడుతున్న విద్యార్థులపై స్పెషల్ ఫోకస్ చేయాలని తెలిపింది. అలాంటి విద్యార్థుల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడాలని సూచించింది.ప్రతి రోజూ అరగంట పాటు రీడింగ్ యాక్టివిటీకి టైం ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశించింది. స్కూల్ బుక్స్‌తో పాటు స్టోరీ బుక్స్, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లను చదివించాలని క్యాలెండర్‌లో స్పష్టం చేసింది. దీంతో పాటు.. స్టూడెంట్స్‌కి రెగ్యూలర్‌గా హెల్త్ చెకప్లను చేయించాలని అకాడమిక్ క్యాలెండర్‌లో తెలిపారు. ఏటా రెండుసార్లు పిల్లలకు కచ్చితంగా హెల్త్ చెకప్ చేయించాలని ఆదేశించారు.

Related Posts