YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై దాడులు

నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై దాడులు

కరీంనగర్, మే 28
ఎలాంటి అనుమతులు లేకుండా మోసాలకు పాల్పడుతున్న నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ మహబూబ్, రుద్రంగి మండలం కేంద్రానికి చెందిన బొండు అంజయ్య, గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ఓరుగంటి రాములు నకిలీ ఏజంట్లుగా గుర్తించారు. ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నకిలీ వీసాలు ఇచ్చి మోసానికి పాల్పడుతున్నారని తెలిపారు.ఉపాధి కోసం గల్ప్ దేశాలకు వెళ్ళే వారికి నకిలీ విసాలు అంటగట్టి అందినకాడికి దోచుకుని మోసానికి పాల్పడే వారు చాలా మంది ఉన్నారని ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 19 మందిని గుర్తించి కేసులు నమోదు చేశామని ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు.నకిలీ గల్ఫ్ ఎజెంట్స్ విజిట్ వీసాల పై జిల్లాలో ఉన్న నిరుద్యోగులని టార్గెట్ చేసి వారి నుండి అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని మాయ మాటలు చెప్పి గల్ఫ్ దేశాలకి పంపిస్తారని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తరువాత కంపెనీ వీసా కాదని తెలిసి దేశం కానీ దేశంలో ఎం చేయాలో తెలియక అష్ట కష్టాలు పడి స్వదేశానికి తిరుగు ప్రయాణం అవడం లేదా అక్కడే ఏదో చిన్న చితక కూలి పని చేసుకోవడం వంటివి జరుగుతునాయని తెలిపారు.ఎవరైతే ఏజెన్సీల లేదా ఏజెంట్ల చేతిలో మోసపోయారో వారు నేరుగా పోలిసులకు పిర్యాదు చేస్తే ఆ పిర్యాదు పై తగిన రీతిలో విచారణ జరిపి నేరం రుజువు అయితే సదరు ఏజెంట్ పై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో గత సంవత్సరం 43 కేసులు నమోదు కాగ, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 19 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.గల్ప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేసే వారి ఏజెన్సీ రద్దు కు సిఫారసు చేయడం తో పాటు వారిపై PD యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ఉపాధి కోసం గల్ప్ దేశాలకు వెళ్ళాలనుకునే వారు లైసెన్స్ కలిగి ఉన్న ఏజెంట్లను మాత్రమే ఆశ్రయించాలని కోరారు.నకిలీ ఏజంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు లైసెన్స్ గల ఏజెంట్ల వివరాలు తెలుసుకోడానికి పోలీస్ శాఖ వారిని సంప్రదించవచ్చని సూచించారు. జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు.. విదేశాలకు పంపిస్తానని డబ్బులు తీసుకొని , పాస్ ఫోర్ట్ తీసుకుని పంపకుండా మోసం చేసిన , నకిలీ గల్ఫ్ ఏజెంట్ల కి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు అందించాలని కోరారు.జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేకమైన చర్యల నివారణ కోసం ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో పలు లాడ్జిలు, హోటల్స్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. లాడ్జిలలో బసకోసం వచ్చే వారి ఆధార్ కార్డు లు, ఇతర ఐడెంటిటీ కార్డులు పరిశీలించారు.లాడ్జిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని లాడ్జీల నిర్వాహకులను హెచ్చరించారు. ఎవరైన కొత్తవారు, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమచారం ఇవ్వాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా లాడ్జీలు, హోటల్స్ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు.తనిఖీల్లో తంగళ్ళలపల్లి మండల కేంద్రంలో చందా అరుణ, చందా నందిత ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలడంతో వారిపై కేసు నమోదు చేసి విటుడు రాహుల్ యాదవ్ అను అరెస్టు చేసినట్లు ఎస్పీ ప్రకటించారు. వ్యభిచారం నిర్వహిస్తే కఠిన కేసులు పెడతామని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని అలాంటి వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related Posts