YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మండి బిర్యానీ తిని ఆసుపత్రి పాలైన కుటుంబం.!

మండి బిర్యానీ తిని ఆసుపత్రి పాలైన కుటుంబం.!

రంగారెడ్డి
పెళ్లి రోజు కదా అని కుటుంబ సభ్యులతో కలసి ఓ వ్యక్తి హోటల్ కు వెళ్ళాడు... బిర్యానీ  ఆర్డర్ చేసి తిన్నారు.... కొద్ది సేపటికే వాంతులు, విరోచనాలు అయ్యాయి... అవస్థలు పడి ఆసుపత్రి లో చేరారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో  చోటు చేసుకుంది..
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని అప్పరెడ్డిగూడా గ్రామానికి చెందిన కావాలి నరేందర్ తన పెళ్లి రోజు ఉందని ఈనెల 22వ తేదీన బుధవారం రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో షాద్ నగర్ పట్టణంలోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్  లో తన  కుటుంబ సభ్యులతో కలిసి మండి బిర్యానీ తిన్నరు   తర్వాత ఇంటికి చేరుకున్న క్రమంలో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు విరేచనాలు అయ్యాయి దీంతో శంషాబాద్  ని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు అప్పటికే నరేందర్ కు రక్తపు వాంతులు విరేచనాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు ఆయనతోపాటు ఆయన భార్య మంగమ్మ కుటుంబ సభ్యులు దీక్షిత తన్విక అనిరూద్ అభిలాష్ జోష్ణ  సాయి శ్రీకర్ మొత్తం ఎనిమిది మందికి అస్వస్థత కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు షాద్ నగర్ పట్టణంలో గత కొంతకాలంగా హోటల్స్  రెస్టారెంట్లు బిర్యాని సెంటర్లు ఎక్కడ కూడా పరిశుభ్రత పాటించకపోవడం నాణ్యత ప్రమాణాలు కూడా లేకపోవడంతో నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతున్నాయి ప్రతిరోజు ఎక్కడో ఒకచోట బిర్యానీలలో ఈగలు దోమలు పురుగుల కథనాలు వెలుగులోకి వస్తున్న సంబంధిత అధికారులు మాత్రం తాత్కాలికంగానే ఫైన్లు వేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించకపోవడంతో  నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు హోటళ్ల నిర్వాహకులు పెళ్లిరోజు ఉంది కదా బిర్యాని తిని హోటల్లో వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తే ఆసుపత్రిలో లక్ష రూపాయలకు దారితీసింది అంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఫుడ్ ఇన్స్పెక్టర్ తో పాటు సంబంధిత అధికారులు షాద్ నగర్  పట్టణంలో ఉన్న హోటల్లో రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్ లలో  పరిశుభ్రత పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బోజన ప్రియులు..

Related Posts