YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లెక్కించే ప్రక్రియ శాంతియుతంగా నిర్వహించాలి

లెక్కించే ప్రక్రియ శాంతియుతంగా నిర్వహించాలి

శ్రీకాకుళం
సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు నిర్వర్తించే పాత్ర అత్యంత కీలకమని, సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు కలిసికట్టుగా పని చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జీలాని సమూన్ లెక్కింపు ప్రక్రియ సూక్ష్మ పరిశీలకులకు ఆదేశించారు.
మంగళవారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో సార్వత్రిక ఎన్నికలు-2024 నేపద్యంలో జూన్ 4 వ తేదీన నిర్వహించనున్న లెక్కింపు ప్రక్రియపై సూక్ష్మ పరిశీలకుల శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జీలాని సమూన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13 న పోలింగు రోజున ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వహించడం జరిగిందని, ఆ క్రమంలో సూక్ష్మ పరిశీలకుల మంచిగా పనిచేసారని, పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోవడం జరిగిందన్నారు. గత ఆరు నెలలుగా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు రిటర్నింగ్ అధికారులు నుంచి వివిధ స్థాయి లో అధికారులు సిబ్బంది తదితరులు పని చెయ్యడం జరిగిందన్నారు. పొలింగ్ రోజున మనందరం కలిసి కట్టుగా ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ దశకు చేరుకున్నట్లు తెలిపారు.  అయితే మరో కీలక మైన బాధ్యతలు మనందరిపై ఉందని తెలిపారు.
జూన్ 4 వ తేదీన ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమన్నారు.  పొలింగ్ రోజున కష్టతరమైన విధులను, బాధ్యతలను సూక్ష్మ పరిశీలకులు ఎంతో ఇష్టంగా చేశారని తెలిపారు. జూన్ 4 వ తేదీన లెక్కింపు కేంద్రాల్లోని ప్రతి టేబుల్ వద్ద ఒక సూక్ష్మ పరిశీలకుని నియమించడం జరుగుతుందన్నారు. నిబంధనల మేరకు సజావుగా లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయడానికి సూక్ష్మ పరిశీలకులు కృషి చేయాలని, పోస్టల్ బ్యాలెట్, ఈటీపిబిఎస్, ఈవిఎమ్ లలో ఓట్లు, వివి పాట్స్ ఓటర్ స్లిప్స్ లెక్కింపు చెయ్యాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సూక్ష్మ పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు పోలింగ్ రోజు ఎంతో బాద్యతాయుతంగా విధులు నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్‌లను నిర్వహించడం, ఎలక్ట్రానిక్‌గా ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ETBPS), ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లు (EVM) మరియు ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్స్ (VVPAT ట్రయల్స్) వంటి వివిధ అంశాలను మైక్రో అబ్జర్వర్స్ నిశితంగా పరిశీలించడం ఉంటాయన్నారు. 
పవర్ ఫాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి స్థాయిలో ఈ మొత్తం ప్రక్రియ ను వివరించడం జరిగిందన్నారు. కొన్ని సందర్భలలో పరిశీలకులుగా తీసుకోవలసిన జాగ్రత్తలు విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. వాటికి అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు నిర్ణయాలు తీసుకుంటారని జిల్లా ఎన్నికల అధికారి  తెలియ చేశారు. ఫ్రీ, ఫెయిర్, పారదర్శకంగా ఓట్ల లెక్కింపు చెయ్యడం మీ అందరిపై ఉన్న ప్రాధాన బాధ్యత అని పేర్కొన్నారు.  ఓట్ల లెక్కింపులో పరిశీలన ప్రక్రియ లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని , ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం లో మీ మీ వంతు పనితనం ముఖ్యం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు తప్పనిసరి అని లేక్కింపు కేంద్రం వద్ద అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఈ శిక్షణా తరగతుల కార్యక్రమం లో నోడల్ అధికారి ఎన్ బాలాజీ, మాస్టర్ ట్రైనర్లు శేషగిరి, మెప్మా పీడీ కిరణ్ కుమార్, ఎల్డిఎం సూర్య కిరణ్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వ మోహన్ రెడ్డి, సూక్ష్మ పరిశీలకులు పాల్గొన్నారు.

Related Posts