YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మీకు పల్లీలు తినే అలవాటు ఉందా? అయితే మీరు లక్కీ.. ఎందుకంటే..

మీకు పల్లీలు తినే అలవాటు ఉందా? అయితే మీరు లక్కీ.. ఎందుకంటే..

మీకు పల్లీలు తినే అలవాటు ఉందా? అయితే, రోజూ కొద్ది మోతాదులో తింటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పల్లీలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కార్డియో వాస్క్యులర్ వ్యాధులు వచ్చే ఆస్కారం చాలా తక్కువని పరిశోధనల్లో తేలింది. అయితే, రోజూ సగటున ఎన్ని పల్లీలు తినాలి? అంటే, ఏ సమయంలోనైనా ఫర్వాలేదు కానీ.. 4-5 వేరు శెనగలు అంటే.. పది గింజల వరకే తినాలట. దీని వల్ల కెమికల్ స్ట్రోక్/కార్డియో వాస్క్యులర్ సమస్య దరిదాపుల్లోకి కూడా రాదని చెబుతున్నారు జపాన్లోని ఒసాకా యూనివర్సిటీకి చెందిన పరిశోధన బృందం సభ్యులు. పల్లీల్లో గుండెకు మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలోని మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్ వంటివి మంచి చేస్తాయి. అలాగే అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుతాయని కూడా జపాన్ పరిశోధకులు చెబుతున్నారు.

Related Posts