భరణ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గిపోవడంతో పాటు, అంతర్జాతీయంగా పరిస్థితుల ప్రభావం స్తబ్దుగా ఉండటం వల్ల మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గినట్టు బులియన్ ట్రేడర్లు చెప్పారు. నేడు(శనివారం) బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర 250 రూపాయలు తగ్గి, రూ.31,200గా నమోదైంది.
అయితే, గ్లోబల్ మార్కెట్లో మాత్రం 0.15 శాతం పెరిగి ఔన్సు ధర 1,349.30 డాలర్లకు చేరింది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 250 రూపాయల చొప్పున పెరిగి రూ.31,200, రూ.31,050గా నమోదయ్యాయి. కాగ, కిలో వెండి ధర రూ. 350 తగ్గడంతో నేటి మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ. 40,650గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గిపోయాయని విశ్లేషకులు చెప్పారు.