న్యూఢిల్లీ, మే 30,
దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. 543 స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఆరు విడతల పోలింగ్ పూర్తయింది. జూన్ 1న తుది విడత ఓటింగ్ జరుగనుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ సర్వే వైరల్ అవుతోంది. ప్రముఖ సర్వే సంస్థ టౌమ్స్‌నౌ చేసిన సర్వే ఫలితాలుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సర్వేలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని 370 స్థానాలు సాధిస్తుందని అంచనా. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి కేవలం 140 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. దేశంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో టౌమ్స్‌నౌ సర్వే బీజేపీకి అనుకూలంగా ఉండడం, అదీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని తెలుపడం సంచలనంగా మారింది. వరుసగా బీజేపీ మూడు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదు. కాంగ్రెస్ పేరిట ఈ రికార్డు ఉంది. ఈసారి బీజేపీ గెలిచి.. నరేంద్రమోదీ ప్రధాని అయితే అది సరికొత్త రికార్డు అవుతుంది. ఇప్పటికే బీజేపీ రెండు పర్యాయాలు సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మరోమారు సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రావడం మరో రికార్డు. ఇక వరుసగా మూడు పర్యాయాలు ప్రధాని అయిన రికార్డు ఇప్పటి వరకు జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉంది. మోదీ మూడోసారి ప్రధాని అయితే.. ఆ రికార్డు సమం అవుతుంది. టైమ్స్‌నౌ సర్వే చూస్తే… ఇండియా కూటమికి మళ్లీ నిరాశే అనిపిస్తుంది. కూటమిలో మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, లాలూప్రసాద్‌యాదవ్, శరద్‌పవార్, ఉద్ధవ్‌ఠాక్రే, స్టాలిన్, పిరయి విజయన్, వంటి ఉద్ధండులు ఉన్నారు. అయినా కూటమి 140 సీట్లు దాటే పరిస్థితి లేదని సర్వే తేల్చడం గమనార్హం. ఇసారి ఎలాగైనా బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంలో ఇండియా కూటమి గట్టిగా ప్రయత్నిస్తోంది. అయినా ఫలితం లేకపోవడం కూటమిని టెన్షన్ పెడుతోంది. ఈమేరకు ఈనెల 1న ఇండియా కూటమి సమావేశం కానుంది. ఫలితాల తర్వాత తీసుకునే చర్యలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి గెలిచి నరేంద్రమోదీ ప్రధాని అయితే మాత్రం ప్రపంచంలో భారత్‌కు తిరుగు ఉండదు. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు భారత ఎన్నికలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇప్పటికే మోదీ విశ్వగురువుగా కీర్తించబడుతున్నారు. మరోమారు ఆయనే ప్రధాని అయితే.. ఇకపై ప్రపంచ దేశాలు శాసించే స్థాయి నుంచి అర్థించేస్థాయికి వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. మరి టైమ్స్‌నౌ సర్వే ఫలితాలు ఏమేరకు నిజమవుతాయో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి ఉండాలి.