న్యూఢిల్లీ, మే 30,
ప్రపంచానికి మరో ముప్పు రాబోతోందా.. కరోనాను మించిన వైరస్ విజృంభించబోతోందా.. ప్రజలు సంసిద్ధంగా ఉండాల్సిందేనా అంటే అవుననే అంటున్నారు. యూకే మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు పాట్రిక్ వాలెన్స్. బ్రిటిష్ ప్రభుత్వం మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఇదే సమయంలో దీనిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా లేదని పేర్కొన్నారు. పోవైస్‌లోని హే ఫెస్టివల్‌లో జరిగిన ఒక ప్యానెల్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. 2021లో నిర్వహించిన జీ7 సదస్సులో వాలెన్స్ కీలక విషయాలు వెల్లడించారు. కోవిడ్ కన్నా తీవ్రమైన మహమ్మారి ప్రపంచంపై విరుచుకు పడుతుందని తెలిపారు. వేగవంతమైన రోగ నిర్ధారణ పరీక్షలు, వేగవంతమైన టీకాలు, వేగవంతమైన చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉండాలి అని సూచించారు. ఇదిలా ఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య గణాంకాల ప్రకారం.. కోవిడ్ –19 మహమ్మారి జనన సమయంలో ఆయుర్దాయం పుట్టినప్పుడు ఆరోగ్యకరమైన ఆయుర్దాయం (HALE) యొక్క స్థిరమైన లాభం ధోరణిని తిప్పికొట్టింది. కోవిడ్ కారణంగా మనిషి ఆయుర్దాయం తగ్గిందని తెలిపింది. 2019 నుంచి 2021 మధ్య, ప్రపంచ ఆయుర్దాయం 1.8 సంవత్సరాలు తగ్గిందని తెలిపింది. 2012 నాటికి పడిపోయిందని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్యవంతమైన ఆయుర్దాయం 2021లో 1.5 సంవత్సరాలు తగ్గి 61.9 సంవత్సరాలకు పడిపోయింది (2012 స్థాయికి తిరిగి వచ్చింది). 2024 నివేదిక కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రభావాలు అసమానంగా ఎలా అనుభవించాయో హైలైట్ చేస్తుంది. 2019 మరియు 2021 మధ్య కాలంలో ఆయుర్దాయం సుమారు 3 సంవత్సరాలు, ఆరోగ్యకరమైన ఆయుర్దాయం 2.5 సంవత్సరాలు తగ్గడంతో అమెరికా మరియు ఆగ్నేయాసియా ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనికి విరుద్ధంగా, పాండమిక్ యొక్క మొదటి రెండు సంవత్సరాలలో పశ్చిమ పసిఫిక్ ప్రాంతం కనిష్టంగా ప్రభావితమైంది. ఆయుర్దాయం 0.1 సంవత్సరాల కంటే తక్కువ, ఆరోగ్యకరమైన ఆయుర్దాయం 0.2 సంవత్సరాలలో నష్టపోయింది.
చైనాల్ మహామ్మారి
వూహాన్ ల్యాబ్‌లో కోవిడ్–19 వైరస్‌ను సృష్టించి దానిని బయటకు వదిలిన డ్రాగన్ కంట్రీ చైనా మరో వైరస్‌ను పుట్టించింది. హెబీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఎబోలా తరహాలోని మరో కొత్త వైరస్‌ను సృష్టించారు. ఎబోలా మాదిరిగానే ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది. మనిషిని కేవలం మూడు నెలలల్లోనే ఇది చంపేస్తుంది. వ్యాధికారక ప్రభావాలను అధ్యయనం చేసేందుకే శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ను సృష్టించారు. అయితే ఇప్పుడు ఈ వైరస్ ప్రయోజనాలు, ప్రమాదాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కోవిడ్ తరహాలో బయటకు వస్తే ప్రపంచానికి మరో ముప్పు దప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ వైరస్ స్వభావం సింథటిక్ అని తెలుస్తోంది. ఈ అధ్యయన నివేదిక సైన్స్ డైరెక్ట్‌లో ప్రచురితమైంది. ఎబోలా వైరస్‌ను ఉపయోగించి సృష్టించిన ఈ కొత్త వైరస్‌పై సాగిస్తున్న పరిశోధన వివాదాస్పదంగా మారింది. అయితే ఈ పరిశోధన ఉద్దేశం వివిధ వ్యాధులను నివారించడం. లక్షణాలను పరిశోధించడం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ మనిషి శరీరంపై ఎబోలా లాంటి ప్రభావాన్నే చూపుతుంది. పరిశోధకుల బృందం ఎబోలా వైరస్ నుంచి గ్లైకోప్రొటీన్(పీజీ)ని స్వీకరించేందుకు వెసిక్యూలర్ స్టోమాటిటిస్ వైరస్(వీఎస్‌వీ)ని ఉపయోగించింది ఇక ఈ వైరస్‌ను శాస్త్రవేత్తలు సిరియన్ హామ్ట్సర్స్(జంతువుల)సమూహంపై పరీక్షించారు. వీటిలో ఐదు మగ, ఐదు ఆడ జాతులు ఉన్నాయి. ఈ జంతువులకు ఈ వైరస్‌ను ఇంజెక్టు చేయగా, వాటిలో ఎబోలా లాంటి లక్షణాలు కనిపించాఇ. మూడు రోజుల్లోనే అవి మృతిచెందాయి. ఈ వైరస్ ఇంజెక్ టచేయగానే కొన్ని జంవుతువుల కళ్లు దెబ్బతిన్నాయి. ఆప్టిక్ నరాలలో తీవ్రమైన ప్రభావం కనిపించింది. 2014–16 మధ్య కాలంలో ఆఫ్రికన్ దేశాలలో ఎబోలా వ్యాప్తి చెందింది. దీనివలన వేలాదిమంది మరణించారు.