YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రైతుల్లో భరోసా పెంచాలి : సీఎం చంద్రబాబు

రైతుల్లో భరోసా పెంచాలి : సీఎం చంద్రబాబు
సీజన్లో సాగునీటి విడుదలపై రైతుల్లో భరోసా పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం  నీరు-ప్రగతి, వ్యవసాయంపై అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడుతూ నీటి చేరిక ఎంత ముఖ్యమో, జలాశయాల నిర్వహణ అంతకన్నా ప్రధానమన్నారు. సాగునీటి విడుదల తేదీలను ముందే ప్రకటించాలని అధికారులకు సూచించారు. పంట కాలువలు, చెరువులను నీటి నిల్వకు సంసిద్ధం చేయాలన్నారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేయాలి. రిజర్వాయర్లు, చెరువులకున్న 750గేట్లను తనిఖీ చేయాలి. పకడ్బందీగా గేట్ల నిర్వహణ ఉండేలా శ్రద్ధపెట్టాలని అన్నారు. భూగర్భాన్ని అతిపెద్ద జలాశయంగా మార్చుకోవాలి. జల సంరక్షణ చర్యలు ముమ్మరం చేయాలి. మైక్రో ఇరిగేషన్ మరో 4రెట్లు పెరగాలి. కోటి ఎకరాల్లో పండ్లతోటల సాగును ప్రోత్సహించాలి. ఉపరితల నీటి వినియోగంపై అధ్యయనం చేయాలి. వర్షపాతాన్ని ముందస్తు అంచనా వేయాలని అన్నారు. దానిని బట్టి డ్రై స్పెల్ మిటిగేషన్ యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి. గత ఏడాదిలానే ఈ ఏడాది కూడా కృష్ణా ఆయకట్టుకు ముందస్తుగా సాగునీటిని విడుదల చేయాలి. సేద్యపు పనులకు రైతులు ఇబ్బంది పడకుండా చూడాలి.‘ఏరువాక’ కార్యక్రమం విజయవంతం చేయాలని అయన అన్నారు. ఖరీఫ్ సీజన్ లో  వర్షాభావం ఎదుర్కోవాలి.  రెయిన్ గన్స్,జీబా టెక్నాలజిని వినియోగించుకోవాలి. ప్రజాదరణ ఉన్న వరి ధాన్యం రకాలనే సాగుచేయాలని సూచించారు. వినియోగంలో ఉన్న ధాన్యం రకాల సేద్యాన్ని ప్రోత్సహించాలి. పది రాష్ట్రాల రైతులు రోడ్లపై ఉన్నారు. ఆందోళనలు చేస్తున్నారు. సహాయ నిరాకరణకు దిగారు. పంట ఉత్పత్తులను రోడ్లపై పారబోసే దుస్థితి వచ్చింది. మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదంటే మనం చేసిన పనులే కారణం. ఈ ఏడాది రూ.10వేల కోట్ల నరేగా నిధుల వినియోగం లక్ష్యం చేరాలని అన్నారు. నెల్లూరు,చిత్తూరులో లేబర్ కాంపోనెంట్ పెరగాలి. పంటకుంటల తవ్వకం ముమ్మరం చేయాలి.  పాఠశాలల ప్రహరీగోడల నిర్మాణం వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. 

Related Posts