YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజకీయ విషయాలకే ప్రాధాన్యం

రాజకీయ విషయాలకే ప్రాధాన్యం

తిరుపతి, జూన్ 3
ఏపీ ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసినా వ్యక్తిగత విషయాలు కంటే.. రాజకీయ అంశాలకే ప్రాధాన్యత దక్కుతుంది. ఎవరు గెలుస్తారు?ఎవరు ఓడిపోతారు? గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది? ఓడిపోతే ఎంత తేడాతో? ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఏ నోట చెప్పినా ఇదే మాట. మొత్తానికైతే జగన్, చంద్రబాబు, పవన్ లకు మించి సామాన్య జనాల్లోనే ఎన్నికల కౌంటింగ్ పై అంచనాలు ఉన్నాయి. చాలామంది టెన్షన్ టెన్షన్ తో గడుపుతున్నారు.సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న అతి అంతా ఇంతా కాదు. అప్పుడే పలానా ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ ద్విచక్ర వాహనాల నంబర్ ప్లేట్లకు అతికిస్తున్నారు. కార్లకు సైతం స్టిక్కర్లు దర్శనమిస్తున్నాయి. వైసీపీ నేతలు అయితే జూన్ 9న జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా చెప్పుకొస్తున్నారు. ఆరోజు వైజాగ్ లో హోటల్లు, రిసార్ట్లు బుక్ అయిపోయాయని కూడా చెబుతున్నారు. రైళ్లు, విమానాల టిక్కెట్లు కూడా ఖాళీ లేదని ప్రచారం చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి జగన్ ప్రమాణస్వీకారం రోజు వైసీపీ శ్రేణులకు ఫుడ్ మెనూ ఇది అంటూ.. ఒక జాబితా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఇక బెట్టింగుల గురించి చెప్పనవసరం లేదు. ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ వరకు బెట్టింగులు కొనసాగుతూనే ఉన్నాయి.రాజకీయాలపై విపరీతంగా మోజు ఉన్నవారు, పార్టీలపై పిచ్చి ఉన్నవారు ఒక రకమైన టెన్షన్ వాతావరణంతో గడుపుతున్నారు. మందుబాబులు అయితే తెగ తాగేస్తున్నారు. ప్రతిక్షణం కౌంటింగ్ గురించి ఆలోచించే వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల టెన్షన్ గురించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. రెండు జట్ల మధ్య కబాడీ మ్యాచ్ జరుగుతుంటే..జట్లలో ఉండే క్రీడాకారుల కంటే.. ఆ ప్రాంగణంలో ఉన్న ప్రేక్షకులు టెన్షన్ తో గడుపుతుంటారు. కబాడీ క్రీడకు సంబంధించి ఏవేవో సూచనలు ఇచ్చి క్రీడాకారులను ఉత్సాహపరుస్తుంటారు. ఇప్పుడు అదే వీడియోను జతపరుస్తూ.. ఎన్నికల్లో పోటీ చేసిన వారి కంటే.. పార్టీల అధినేతల కంటే వీరికే టెన్షన్ అంటూ మిమ్స్ పెడుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రజల్లో ఆ తరహా టెన్షన్ ఉందని చెప్పేందుకు ఈ వీడియో ది బెస్ట్ ఉదాహరణగా మిగిలింది.

Related Posts