YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కడప లో తేడా కొట్టినట్టు.. ఉందే

కడప లో తేడా కొట్టినట్టు.. ఉందే

కడప,జూన్ 3
ఎగ్జిట్ పోల్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గాలి వీస్తోందని వెల్లడయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పడు మొత్తం ఇరవై ఐదు సీట్లను స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా అదే చెప్పారు. అయితే చాలా మంది కడప లోక్ సభ సీటులో వైఎస్ఆర్‌సీపీని ఎవరూ ఓడించలేరని భావిస్తున్నారు. కానీ ఏబీపీ-సీఓటర్ ఎగ్జిట్ లో భిన్నమైన ఫలితం వస్తోంది. కూటమికి 21 నుంచి 25 సీట్లు వస్తాయని ఏబీపీ - సీఓటర్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. వైఎస్ఆర్‌సీపీ కి సున్నా నుంచి నాలుగు సీట్లలో చాన్స్ ఉంది. అంటే నాలుగు సీట్లలో మాత్రమే గట్టి పోటీ ఇస్తోంది. ఆ నాలుగు సీట్లలో కడప నియోజకవర్గం కూడా ఉండి ఉండవచ్చు. కడప ఇలా రిస్క్ లో పడటానికి కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు షర్మిల అని. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసురాలిగా అడుగు పెట్టిన ఆమె.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నారు. విస్తృతంగా పర్యటించారు. కడప లోక్ సభకు పోటీ చేశారు. కొంగు చాపి న్యాయం చేయాలని ప్రజల్ని అడిగి సెంటిమెంట్ రాజకీయాలు చేశారు. షర్మిల దూకుడుగా చేసిన రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ 3.3 శాతానికి చేరుకుంటుందని స్పష్టమయింది. గత ఎన్నికల్లో ఇది ఒక్క శాతం కూడా లేదు. కాంగ్రెస్‌కు పెరిగిన ప్రతి ఒక్క ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అవుతుంది. ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ పార్టీదే. దళితులు, ముస్లింలు , గిరిజనుల్లో ఈ సారి కొంత కాంగ్రెస్ వైపు మళ్లినట్లుగా కనిపిస్తోంది. ఇది వైసీపీని భారీగా దెబ్బతీస్తున్నట్లుగా చెబుతున్నారు. షర్మిల భర్త అనిల్ కుమార్ కు క్రైస్తవ వర్గాల్లో ఉన్న నెట్ వర్క్ కూడా ఇందుకు ఉపయోగపడిందని అనుకోవచ్చు. కడప లోక్ సభ నియోజకవర్గంలో షర్మిల కూడా గట్టి పోటీ ఇచ్చారు. ఆమెకు ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో భారీగా ఓట్లు పోలయ్యాయని ఎగ్జిట్ పోల్ అంచనాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. షర్మిల గెలవలేకపోవచ్చు కానీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా నష్టం చేయడం ఖాయంగా  కనిపిస్తోంది. మరో వైపు ఏపీలో ఎన్నికల ఫలితాలపై గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. నువ్వా నేనా అన్నట్టుగా నేతలు పోటీ పడటమే ఇందుకు ప్రధాన కారణం. పోలింగ్ ముగిసిన వెంటనే విజేతలు ఎవరనే దానిపై మొదలైన సస్పెన్స్‌.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్ పోల్స్‌తో దీనిపై ఓ స్పష్టత వస్తుందని భావించినా.. అందులోనూ సేమ్ సీన్ కనిపించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పలు ఎగ్జిట్ పోల్స్ వైసీపీదే విజయం అంటుంటే.. మరికొన్ని మాత్రం ఏపీలో కింగ్ కూటమే అని అంచనా వేశాయి. దీంతో గత 20 రోజులుగా ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ మరింత పెరిగింది. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్‌తో వాస్తవ ఫలితాలు అంచనా వేయొచ్చని విశ్లేషకులతో పాటు ప్రధాన పార్టీల నాయకులు భావించారు. అయితే క్లారిటీ ఇవ్వాల్సిన ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు నేతలను మరింత టెన్షన్ పెడుతున్నాయి. భిన్నమైన అంచనాలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌ రాజకీయ పార్టీ శ్రేణులను కన్ఫ్యూజన్‌లో పడేశాయి. తమకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్‌ నిజమవుతాయని.. ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అంటూ నేతలు విమర్శలు గుప్పించారు.ఎగ్జిట్‌పోల్స్‌ గందరగోళంగా ఉన్నాయి.. లోకల్‌ సర్వేలు తమకు పాజిటివ్‌గా ఉన్నాయంటోంది వైసీపీ. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తమకే అనుకూలంగా ఉన్నాయి.. అధికారం తమదే అని కూటమి పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తమకు అనుకూలంగా ఉన్నాయని ఎవరికి వారు ప్రకటించుకుంటున్నారు. అందుకు కారణాలు కూడా విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్‌తో ఓ అంచనా వస్తుందని భావించిన నేతలు, పార్టీలకు మరింత టెన్షన్ పెరిగింది.

Related Posts