తాడిపత్రి
తాడిపత్రి నియోజకవర్గo నుంచి బహిష్కరణకు గురైన స్వతంత్ర అభ్యర్థి ని అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం వహించిన పెద్దపప్పూరు ఎస్ఐ శరత్ చంద్రను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. - ఎన్నికల పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన రాళ్ల దాడిలో స్వతంత్ర అభ్యర్ది, జేసీ ప్రభాకరరెడ్డి ప్రధాన అనుచరుడు పరిమి సోమశేఖరనాయుడుపాల్గొన్నాడు. దీంతో ఆయనను నియోజకవర్గంలో పర్యటించరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలు ధిక్కరించి ఆయన పెద్దపప్పూరు మండలంలో సంచరిస్తున్నట్లు తెలుసుకున్న ఉన్నతాధికారులు వెంటనే అరెస్ట్ చేయాలని ఎస్ఐ శరత్ చంద్రను ఆదేశించారు. అయినా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతని పై సస్పెన్షన్ వేటు వేశారు...