జగ్గయ్యపేట
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా పెనుగంచిప్రోలు మండలంలో ఎటువంటి, గొడవలు అల్లర్లు చెలరేగకుండా పోలీస్ బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసామని రూరల్ డీపీసీ శ్రీనివాస రావు వెల్లడించారు.సోమవారం ఉదయం మాక్ డ్రిల్ నిర్వహించారు.మాక్ డ్రిల్ అనంతరం డిసిపి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జిల్లా లో 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని నలుగురు కి మించి ఎవరు గుమిగూడి ఉండరాదు అని ,కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చాక ఎవరు విజయోత్సవ ర్యాలీలు చేయడం,బాణసంచా కాల్చడం,సభలు సమావేశాలు ఏర్పాటు చేయవద్దని తెలిపారు. పోలీస్ వారి సూచనలు పాటించకుండా ప్రవర్తించిన వారిపై కేసులు నమోదు చేసి, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినారు ఈ కార్యక్రమంలో నందిగామ ACP డాక్టర్.రవి కిరణ్ , జగ్గయ్యపేట సిఐ పరమేశ్వర్ , జగ్గయ్యపేట సర్కిల్ సబ్ ఇన్స్పక్టర్ లు రాంబాబు, అభిమన్యు, పద్మారావు, సివిల్ మరియు ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.