YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీఎం ఆవాస్తవాలు చెబుతున్నారు

సీఎం ఆవాస్తవాలు చెబుతున్నారు
రాష్ట్రంలో ఆర్గనైజ్డ్ దుష్ప్రచారం కొద్ది నెలలుగా బిజెపి పై జరుగుతోంది. ముఖ్యమంత్రి సైతం ఈ అవాస్తవాలను చెబుతుండటం దారుణం. ఇటీవలే వల్లభాయ్ పటేల్ ప్రాజెక్ట్ కోసం కేంద్రం మూడు వేల కోట్లు ఇచ్చిందని చంద్రబాబు ఓ అబద్దాన్ని ప్రకటించారు. ఓ సిఎం ఇంత దిగజారి మాట్లాడతారాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, ఎంపి జివిఎల్ నరసింహారావు ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆ ప్రాజెక్ట్ కోసం కేంద్రం ఇచ్చింది కేవలం మూడు వందల కోట్లు మాత్రమే. ఇలాంటి అబద్దాలు ఎన్ని చెబుతారని నిలదీసారు. దొలేరా ప్రాజెక్ట్ కు 98వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని మహానాడు సాక్షిగా చంద్రబాబు చెప్పారు. ఆ ప్రాజెక్ట్ విలువ 1400 కోట్లు దాటదు. అబద్దాలు చెప్పడం, అవాస్తవాలు చెప్పడం సిఎం స్థాయి కి తగదని అన్నారు. బురద జల్లి.. పారిపోయే విధానాలు చంద్రబాబు కు సరికాదని అన్నారు. దేశంలోని ఎనిమిది ఇండస్ట్రియల్ జోన్ లలో దొలేరా ఒకటి. 2500 నుంచి 3 వేల కోట్ల వరకే ఈ జోన్ లకు కేంద్రం కేటాయిస్తుంది. 1293 కోట్లు మాత్రమే దొలేరాకు కేంద్రం ఇచ్చింది. మరి సిఎం చంద్రబాబు కు 98 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అన్నారు. వైజాగ్-చెన్నై కారిడార్ ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం రెడీగా ఉందని, అయితే కృష్ణపట్నంను పూర్తి చేయడానికి చంద్రబాబు చొరవ చూపడం లేదని విమర్శించారు.

Related Posts