YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రతనాల సీమగా రాయలసీమ

రతనాల సీమగా రాయలసీమ

కర్నూలు, జూన్ 4,
రాయలసీమ రతనాల సీమ..అంటారు.. ఇప్పుడు నిజంగా రతనాల సీమ మాదిరిగానే మారింది.. సాధారణంగా మట్టిలో రాళ్లు రప్పలు కనిపిస్తుంటాయి.. కానీ.. ఇక్కడ మాత్రం వజ్రాలు కనిపిస్తుంటాయి.. అదికూడా వర్షా కాలంలో మాత్రమే.. సాధారణంగా వర్షం పడితే మట్టి వాసన రావడం సహజం.. కానీ రాయలసీమలో మాత్రం నాలుగు చినుకులు పడితే చాలు మ‌ట్టి నుంచి వ‌జ్రాలు బయటపడతాయి. ఇప్పుడు వర్షాకాలం మొద‌లు కావ‌డంతో వ‌జ్రాల కోసం వేట ప్రారంభించారు. ముఖ్యంగా కర్నూలు ప్రాంత ప్రజలు పనులన్నింటిని వదులుకుని వజ్రాల వేటలో పడ్డారు.. ఏదైనా వజ్రం దొరకకపోతుందా..? తమ పంట పండకపోతుందా..? అదృష్టం కలిసిరాకపోతుందా…? అంటూ తమ పంటపొలాల్లో సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు..ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా జొన్నగిరిలో కొందరికి బంపర్ ఆఫర్ లెక్క.. మూడు వజ్రాలు లభ్యమయ్యాయి. ఓ వజ్రం 6 లక్షల యాభై వేలు, మరో వజ్రం 2 లక్షల యాభై వేలకు విక్రయించగా.. ఇంకో వజ్రం లక్షా ఇరవై వేలకు ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు.. మూడు రోజుల్లో నాలుగు వజ్రాలు దొరకడంతో.. జొన్నగిరికి పెద్ద ఎత్తున వజ్రాల అన్వేషకులు చేరుకుని వేటను కొనసాగిస్తున్నారు.ముఖ్యంగా.. క‌ర్నూలు జిల్లా తుగ్గిలి, జొన్నగిరి, అనంత‌పురం జిల్లా వ‌జ్రక‌రూరులో వ‌జ్రాల కోసం వేట కొనసాగిస్తుంటారు. ఈ ప్రాంతాలతో పాటు ఎమ్మిగనూరు, కోసిగిలోని పంటపొలాల్తొలో కూడా వజ్రాలు లభిస్తూ ఉంటాయి. దీంతో వర్షాలు కురుస్తుండటంతో వ‌జ్రపు రాళ్లు బ‌య‌ట‌ప‌డకపోతాయా..? తమ పంట పండకపోతుందా అంటూ వజ్రాల అన్వేషకులు ఈ ప్రాంతాల్లో సెర్చింగ్ మొదలుపెట్టారు.చిన్న రాయి దొరికినా చాలు త‌మ జీవితాలు మారిపోతాయ‌నే ఆశ‌తో జ‌నం పెద్ద ఎత్తున సంబంధిత గ్రామాల్లో జ‌ల్లెడ ప‌డుతున్నారు. స్థానికంగానేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వజ్రాల వేట కోసం వస్తుండటంతో ఈ ప్రాంతాల్లో సందడి నెలకొంది.

Related Posts