న్యూఢిల్లీ
ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్లో జరుగుతున్న సార్వత్రిక సంగ్రామం పరిణామాలనూ యావత్ ప్రపంచం ఆసక్తిగా పరిశీలిస్తోంది. సాధారణంగా ఇక్కడి వ్యవహారాలపై అంత ప్రాధాన్యమివ్వని పాశ్చాత్య మీడియా.. తాజా ఎన్నికలకు మాత్రం భారీ స్థాయిలో కవరేజీ ఇవ్వడం గమనార్హం. ఇండో-పసిఫిక్లో దిల్లీ కీలకం కావడం, ప్రపంచ ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందుతుండటం, అంతర్జాతీయ వేదికలపై తన వాదనలు భారత్ బలంగా వినిపించడం వంటివి ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించాయి. దీంతో ఎన్నికల కసరత్తు మొదలు.. ప్రధాన పార్టీల ప్రచారాల తీరు, స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ సీఎన్ఎన్ మొదలు బీబీసీ, ఫ్రాన్స్24, అల్జజీరా, గ్లోబల్ టైమ్స్ వంటి అగ్రశ్రేణి మీడియా సంస్థలు పోటాపోటీగా విస్తృత స్థాయిలో కథనాలు ప్రచురించాయి. తుది ఫలితాల కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.....