ఏలూరు
పలు స్థానాల్లో కూటమి అభ్యర్దులు కౌంటింగ్ ప్రారంభంనుంచే మందంజలో వున్నారు. ఏలూరు అసెంబ్లీ వైసిపి అభ్యర్థి ఆళ్ల నానికి తొలి రౌండులో 4598 ఓట్లు, రెండో రౌండ్లో 3243 ఓట్లు, మూడో రౌండ్లో 3842 ఓట్లు పోలయ్యాయి. అలాగే టిడిపి అభ్యర్థి చంటి కి మొదటి రౌండ్లో 8592 ఓట్లు, రెండో రౌండ్లో 6470 ఓట్లు, మూడో రౌండ్లో 6492 ఓట్లు పోలయ్యాయి.
నూజివీడు వైసిపి అభ్యర్థి అప్పారావు కు మొదట రౌండ్లో 5254, రెండో రౌండ్లో 5245, మూడో రౌండ్లో 5283 ఓట్లు, నాలుగో రౌండ్లో 4135 ఓట్లు పోలయ్యాయి. అలాగే టిడిపి అభ్యర్థి పార్థసారథికి మొదటి రౌండ్లో 4858, రెండో రౌండ్లో 5319 ఓట్లు పోలవ్వగా మూడో రౌండ్లో 6142 ఓట్లు, నాలుగో రౌండ్లో 5174 ఓట్లు పోలయ్యాయి.
పోలవరం వైసిపి అభ్యర్థి రాజ్యలక్ష్మి కి మొదట రౌండ్లో 6134, రెండో రౌండ్లో 5441 , మూడో రౌండ్లో 4303 ఓట్లు పోలయ్యాయి. అలాగే జనసేన అభ్యర్థి బాలరాజు కు మొదటి రౌండ్లో 5398, రెండో రౌండ్లో 5921 ఓట్లు పోలవ్వగా మూడో రౌండ్లో 4497 ఓట్లు పోలయ్యాయి.
చింతలపూడి వైసిపి అభ్యర్థి విజయరాజు కి మొదట రౌండ్లో 4744, రెండో రౌండ్లో 4527, మూడో రౌండ్లో 3681 ఓట్లు, నాలుగో రౌండు 2802, ఐదో రౌండ్లో 3422 ఓట్లు, ఆరో రౌండ్లో 4901 ఓట్లు, ఏడో రౌండ్లో 3885 ఓట్లు పోలయ్యాయి. అలాగే టిడిపి అభ్యర్థి రోషన్ కు మొదటి రౌండ్లో 4520, రెండో రౌండ్లో 6149 ఓట్లు, మూడో రౌండ్లో 7680, నాలుగో రౌండ్లో 7334, ఐదో రౌండ్లో 7151 ఓట్లు, ఆరో రౌండ్లో 5743 ఓట్లు, ఏడో రౌండ్లో 5346 ఓట్లు పోలయ్యాయి.
కైకలూరు వైసిపి అభ్యర్థి నాగేశ్వరరావు మొదటి రౌండ్లో 3349 ఓట్లు రాగా, రెండో రౌండ్లో 4423 ఓట్లు పోలయ్యాయి. అలాగే కూటమి అభ్యర్థి కామినేని కి మొదటి రౌండ్లో 5720 ఓట్లు, రెండో రౌండ్లో 5900 ఓట్లు పోలయ్యాయి.
దెందులూరు వైసిపి అభ్యర్థి అబ్బాయి చౌదరికి మొదటి రౌండ్ లో 5862 ఓట్లు, రెండవ రౌండ్లో 4927 ఓట్లు పోలయ్యాయి. అలాగే టిడిపి అభ్యర్థి చింతమనేని కి మొదటి రౌండ్లో 6636 ఓట్లు, రెండో రౌండ్లో 5792 ఓట్లు పోలయ్యాయి.
ఉంగుటూరు వైసిపి అభ్యర్థి వాసు బాబుకు మొదటి రౌండ్లో 4925 ఓట్లు, రెండో రౌండ్లో 9337 ఓట్లు, మూడో రౌండ్లో 4039 ఓట్లు పోలయ్యాయి. అలాగే జనసేన అభ్యర్థి ధర్మరాజుకు మొదట రౌండ్లో 9269 ఓట్లు, రెండో రౌండ్లో 13296 ఓట్లు, మూడో రౌండ్లో 6140 ఓట్లు పోలయ్యాయి.