YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రతిపక్ష హోదా కోల్పొయిన వైసీపీ

ప్రతిపక్ష హోదా కోల్పొయిన వైసీపీ

విజయవాడ, జూన్ 4
ఏపీలో ఎన్నికల ఫలితాలు అధికార వైసిపికి చుక్కలు చూపిస్తున్నాయి. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించి.. సరికొత్త రికార్డు సృష్టించిన.. ఈసారి ఆ ఘనతను కొనసాగించలేకపోయింది.. ఐదేళ్లపాటు పరిపాలించినప్పటికీ.. ఏపీ ప్రజలు ఆ పరిపాలన పట్ల విసుగు చెంది టిడిపి కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు. జగన్ పరిపాలనకు చరమగీతం పాడుతూ.. టిడిపి ఆధ్వర్యంలోని కూటమికి ఘన విజయం దిశగా తీర్పు ఇచ్చారు.. ఉదయం కౌంటింగ్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఏ దశలోనూ వైసిపి అభ్యర్థులు కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో పోరు హోరాహోరీగా సాగుతుందని అందరూ అంచనా వేశారు. కానీ ఓట్ల లెక్కింపులో ఆ దృశ్యం కనిపించలేదు.. వార్ వన్ సైడ్ అన్నట్టుగా కూటమి అభ్యర్థులు దుమ్ము లేపారు. 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏపీలో.. దాదాపు 90 శాతం నియోజకవర్గాలలో అదరగొట్టారు. ఇప్పటివరకు లెక్కించిన అన్ని రౌండ్లలోనూ వైసీపీ అభ్యర్థులు దారుణంగా వెనుకబడ్డారు. ప్రజా తీర్పు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో.. పలుచోట్ల కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ అభ్యర్థులు ఇంటి ముఖం పడుతున్నారు.. ఇలా ఇంటి ముఖం పట్టిన వారిలో గుడివాడ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం అభ్యర్థి వల్లభనేని వంశీ ఉన్నారుఫలితాల సరళి పూర్తి ఏకపక్షంగా ఉండడంతో.. వైసిపికి కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ అసెంబ్లీ స్థానాల ప్రకారం ప్రతిపక్ష హోదా సాధించాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలను వైసిపి గెలుపొందాలి. అయితే ఇప్పటివరకు వెళ్లడైన ఫలితాలలో.. 18కి లోపు స్థానాలలో వైసిపి లీడ్ లో కొనసాగుతోంది. వైసిపి కంటే సొంతంగానే జనసేన 20 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. జనం తీర్పు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కుతుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే వైసీపీ 14 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే చాలామంది మంత్రులు ఓటమి బాట పట్టారు. ధర్మాన ప్రసాదరావు నుంచి మొదలు పెడితే అప్పలరాజు వరకు అందరూ ఓటమి అంచులో నిలిచారు. బొత్స సత్యనారాయణ వంటి వారు మొదట్లో కాస్త ముందంజలో ఉన్నప్పటికీ.. ఆ తర్వాత రౌండ్లలో ఆ దూకుడు కొనసాగించలేకపోయారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రస్తుతం పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ముందంజలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలకు గెలుచుకోగా.. టిడిపి 23 స్థానాలకు పరిమితమైంది. ఈసారి ఎన్నికల్లో వైసిపి గతంలో టిడిపి గెలుచుకున్న స్థాయిలో స్థానాలను దక్కించుకోలేకపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Related Posts