విజయవాడ, జూన్ 4
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 150కి పైగా సీట్లు వస్తాయని కేకే సర్వే అంచనా వేసింది. ఇక ఈ సర్వే చూసి అటు వైసీపీ నాయకులు.. అసలు ఈ సర్వే ఎక్కడిది.? ఎవరు నమ్మలేరని.? అని అంటూ విమర్శలు గుప్పించారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే.. ఆ సర్వే అంచనాలు నిజమయ్యేయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ బట్టి వైసీపీ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కూటమి 156 స్థానాల్లో ఆధిక్యతను చూపిస్తోంది. దీంతో ప్రస్తుతం ఆయన గురించే సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ‘ఎవరు బ్రో నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు..’ అంటూ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు నెటిజన్లు. కొందరు వైసీపీ వస్తుందని అంచనా వేస్తుంటే.. ఇంకొందరు టీడీపీ కూటమి వస్తుందని అంచనా వేశారు. కానీ కేకే సర్వే ఒక్కడే ఏపీలో కూటమి సునామీని ఊహించారని పొగడ్తలతో ముంచెత్తారు.టీడీపీకి 144 స్థానాలలో 133 స్థానాలు కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. అలాగే జనసేన 21 స్థానాల్లో 21 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. పది స్థానాలకు గానూ ఏడు స్థానాలు బీజేపీ గెలుపొందుతుందని కేకే సర్వే చెప్పింది. అటు వైసీపీ 175 స్థానాలలో కేవలం 14 సీట్లు మాత్రమే పరిమితమవుతుందని పేర్కొన్నారు. తాజాగా ట్రెండ్స్ చూస్తే.. వైసీపీ 19 స్థానాల్లో, టీడీపీ 130 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో, జనసేన 19 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. దీన్ని బట్టి.. అటు.. ఇటుగా కేకే సర్వే మొత్తానికి కచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ చెప్పి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి.