YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భారీ లీడ్ లో ఎంపీ నేతలు

భారీ లీడ్ లో ఎంపీ నేతలు

హైదరాబాద్, జూన్ 4
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. 17 స్థానాల్లో ఎక్కువ చోట్ల బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. వరంగల్‌లో ఆరూరి రమేశ్‌ 242 ఓట్ల లీడ్‌లో ఉండగా, మిగతా బీజేపీ అభ్యర్థులు భారీ ఆధిక్యం కనబరుస్తున్నారు. కిషన్‌రెడ్డి(సికింద్రబాద్‌), ఈటల రాజేందర్‌(మల్కాజ్‌గిరి), గొడం నగేశ్‌(ఆదిలాబాద్‌), బండి సంజయ్‌(కరీంనగర్‌), ధర్మపురి అర్వింద్‌(నిజామాబాద్‌), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(చెవెళ్ల), డీకే.అరుణ(మహబూబ్‌నగర్‌), భరత్‌ప్రసాద్‌(నాగర్‌కర్నూల్‌)లో ఆధిక్యంలో ఉన్నారు. ఈటల రాజేందర్‌ మల్కాజిగిరిలో 1.50 లక్షల లీడ్‌లో ఉన్నారు. కరీనంగర్‌లో బండి సంజయ్‌ 50 వేల ఓట్ల ఆధిక్యత కనబరుస్తున్నారు. నిజాబాబాద్, చేవెళ్లలో అర్వింద్, భరత్‌ 30 వేల లీడ్‌లో ఉన్నారు. గొడం నగేశ్‌ 20 వేల లీడ్‌లో ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో డీకే.అరుణ 5 వేల ఓట్ల మెజారిటీలో ఉన్నారు. హైదరాబాద్‌లో మాధవీలత తొలి రౌండ్‌లో 14 వేల ఓట్ల లీడ్‌ సాధించారు.ఇక తెలంగాణలోని ఖమ్మంలో రఘురామిరెడ్డి(కాంగ్రెస్‌) ఆరో రౌండ్‌ ముగిసే నాటికి 60 వేల లీడ్‌ సాధించారు. పెద్దపల్లిలో గడ్డం వశీ, జహీరబాద్‌లో సురేష్‌ షట్కార్, భువనగిరిలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌బాద్‌లో బలరాం నాయక్, నల్గొండలో రఘువీర్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మెదక్‌లో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. మొదటి రౌండ్‌లో వెంకట్రామిరెడ్డి లీడ్‌లో ఉండగా, రెండో రౌండ్‌లో రఘునందన్‌రావు లీడ్‌లోకి వచ్చారు. తర్వాత మూడో రౌండలో మళ్లీ బీఆర్‌ఎస్‌ లీడ్‌లోకి వచ్చింది.

Related Posts