YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నిప్పులకుంపటిగామారిన జమ్మలమడుగు రాజకీయాలు

టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు    నిప్పులకుంపటిగామారిన జమ్మలమడుగు రాజకీయాలు
టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దీనితో జమ్మలమడుగు రాజకీయాలు నిప్పులకుంపటిగా మారాయి. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గీయులపై మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు దాడికి దిగిన విషయం తెలిసిందే. జమ్మలమడుగు అసుపత్రిలో చికిత్స పొందుతున్న తన అనుచరులను రామసుబ్బారెడ్డి పరామర్శించారు. అనంతరం రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆదినారాయణరెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి వర్గీయులది నీచసంస్కృతి, మా అనుచరులపై అన్యాయంగా దాడి చేశారు. ఇప్పటి వరకు జరిగింది వేరు....ఇక నుంచి జరిగేది వేరు. ఇకపై నా అనుచరుల మీద దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయిఅని రామసుబ్బారెడ్డి హెచ్చరించారు.జమ్మలమడుగు మండలంలోని పెద్దదండ్లూరులో ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన గోకుల అజరయ్య కుమారుడు ఏపీఎ్‌సపీ కానిస్టేబుల్‌ సంపత్‌కు వివాహం జరిగింది. అదేరోజు పెద్దదండ్లూరు గ్రామానికి వైసీపీ ఇన్‌ ఛార్జి డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి, కార్యకర్తలు గ్రామానికి హాజరై వివాహ కార్యక్రమంలో పాల్గొని అదే గ్రామంలో ఉన్న కుళాయిరెడ్డి, అయ్యవార్‌రెడ్డిల ఇంటికి వారు వెళ్లారు. ఆ రోజు నుంచి గ్రామంలో గొడవ వాతావరణం ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. అందులో భాగంగా పెద్దదండ్లూరు గ్రామానికి పైముగ్గురు ఎంపీ అవినాష్‌రెడ్డిని ఆహ్వానించారు. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు వైసీపీ ఇన్‌ఛార్జి సుధీర్‌రెడ్డి, ఆయా గ్రామాల నాయకులు పెద్దదండ్లూరు గ్రామానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. అంతలోపే మధ్యాహ్నం దేవగుడి గ్రామం నుంచి సుమారు 250 మంది మంత్రి వర్గీయులు గ్రామంలోకి వచ్చి గోకుల అజరయ్య, అయ్యవార్‌రెడ్డి, కుళాయిరెడ్డి తదితర ఇళ్లపై దాడి చేశారు. అజరయ్య ఇంటి వద్ద అప్పటికే వేచి ఉన్న షామియాను కుర్చీలను ధ్వంసం చేశారు.పెద్దదండ్లూరు గ్రామంలో వైసీపీ కార్యకర్తలతో పాటు రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన హనుమంతరెడ్డి, సంజీవరెడ్డి తదితరులపై దాడి జరిగింది. తమ కార్యకర్తల ఇంటికి వెళ్లాలని కొండాపురం నుంచి హుటాహుటిన జమ్మలమడుగు చేరుకుని పెద్దదండ్లూరుకు వెళుతుంటే జమ్మలమడుగు పోలీసులు రామసుబ్బారెడ్డిని అడ్డుకున్నారు.

Related Posts