అమరావతి జూన్ 6
అధికార యంత్రాంగం తనకు ఓట్లు పడకుండా పనిచేసిందని ప్రజా శాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కె.ఏ.పాల్ ఆరోపించారు. పోటీ చేసిన అభ్యర్థులతో ఎన్నికల అధికారులు సిసిటివి లింక్స్ షేర్ చేసుకోవడం లేదని కూడా ఆయన ఆరోపించారు. కె.ఏ.పాల్ విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తనకు తన కుటుంబ సభ్యుల సంఖ్య ఓట్లు కూడా రాకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. విచారణ జూన్ 6న జరుగనున్నది. పాల్ విలేకరులతో మాట్లాడుతూ ఎనిమిది బూత్ లలో తనకు ఒక్క ఓటు కూడా రాలేదన్నారు. మురళీనగర్ లో 235 బూత్ లు ఉండగా తన కుటుంబ సభ్యులే …తండ్రి, సోదరుడు, సోదరి వంటి వారందరి ఓట్లే 22 వరకు ఉంటాయని అన్నారు. కానీ తనకు వచ్చిన ఓట్లు మాత్రం 4 అన్నారు. ఇదేలా సాధ్యం అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగినప్పుడు తాను లీడింగ్ లో ఉన్నట్లు పోలింగ్ అధికారులే తనకు తెలిపారని అన్నారు. తనకు ఓట్లు రాకుండా ఎవరో కుట్ర పన్నారని ఆయన భావిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఊహించుకోవాలని ఆయన ప్రజలను కోరారు.