YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మూడు రాజధానులకు ప్రజలు..నో

మూడు రాజధానులకు ప్రజలు..నో

గుంటూరు, జూన్ 7,
ఎన్నికల్లో జగన్ రికార్డు సృష్టించారు. దేశమంతా ఏపీ వైపు చూసేలా దిమ్మతిరిగే విజయం సాధించారు. 2024 ఎన్నికల్లోను రికార్డును కొనసాగించారు. అయితే అది విజయం గా కాదు.. ఓటమిలో. గత ఎన్నికల్లో చరిత్రలో మరెవ్వరూ సాధించరేమో అన్నంత రీతిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు చరిత్రలో మరెవ్వరూ ఇంతలా ఓటమి చెందరేమో అన్న రీతిలో ఘోర పరాజయం పొందారు. 151 సీట్లు సాధించిన వైసిపి.. ఈసారి 164 సీట్లు కోల్పోయింది. 2019లో ఆయనపై జనం నమ్మకం పెట్టుకోగా.. ఇప్పుడు ఆ నమ్మకం ఎటో వెళ్లిపోయింది. ఆ విశ్వాసం కరిగిపోయింది. నేను చేసిన మేలు, ఇచ్చిన పథకాలు ఎటు వెళ్లిపోయాయి అంటూ జగన్ నిర్వేదం వ్యక్తం చేసేదాకా పరిస్థితి వచ్చింది.అమరావతి రాజధాని అంశం ఎక్కువగా ప్రభావం చూపింది. ఆ రెండు జిల్లాలే సరి కదా.. ఏం జరుగుతుంది లే అన్న ధీమా మూల్యానికి కారణమైంది. పోనీ మూడు రాజధానులకైనా ముందడుగు పడిందంటే అదీ లేదు. రాజధాని లేని రాష్ట్రం గా ఏపీ అవతరించింది. అమరావతి స్మశానమైంది. కాదు కాదు అలా మంత్రులు ప్రకటించారు. మూడున్నర సంవత్సరాలుగా అమరావతి రైతుల ఆర్తనాధాలను ప్రజలు చూశారు. తమ సొంత ప్రాంతానికి రాజధాని వస్తుందంటే ఉత్తరాంద్రులు స్వాగతించలేదు. తమ నుంచి రాజధానిని దూరం చేశారని రాయలసీమ వాసులు ఆక్రయించారు. మూడు ప్రాంతాల ప్రజలు అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండించారు. తమ ఓటుతో బుద్ధి చెప్పారు.రాష్ట్ర ప్రజలకు ఎంతో మంచి చేశాను అన్నది జగన్ వాదన. ఒకవిధంగా చెప్పాలంటే వర్ణించలేని బాధ కూడా. జనాన్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు కానీ.. జనం చేతిలో మోసపోయింది తానే అన్నట్టు జగన్ ప్రకటించడం ఆయన నిస్సహాయ స్థితికి కారణం. ఆ పరిస్థితి కూడా ఆయనే కారణం. ఆయన స్వయంకృతాపం. ప్రధానంగా జనం భయపడ్డారు. జగన్ పాలనలో కొంత అయితే.. విపక్షాల దుష్ప్రచారంతో మరికొంత. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరేం చేస్తారో నన్న భయం ప్రజలను వెంటాడింది. అందుకు తగ్గట్టుగానే మాట్లాడిన వారికి సిఐడి పట్టుకెళ్ళింది. విపక్ష నేతలపై ఉక్కు పాదం మోపింది. అరెస్టుల ప్రభావం కూడా సామాన్య జనాల్లో భయానికి కారణం అయ్యింది.సంక్షేమ పథకాలు ఇస్తేనే సరిపోదు. అభివృద్ధి కూడా కావాలి అన్నది ప్రజల అభిమతం. మాట తప్పడు మడమ తిప్పడు అన్న మంచి పేరు జగన్ పై ఉన్నా.. ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పారు. మధ్య నిషేధ విషయంలో మాట తప్పరు. సిపిఎస్ రద్దు పైన మాట తప్పారు. ఈ మూడు సహేతుక కారణాలు చాలు జగన్ ఓటమికి. సంక్షేమ పథకాలమాటున ఈ మూడు హామీలు కొట్టుకుపోతాయని జగన్ భావించారు. కానీ అవే విశ్వరూపం చూపాయి. ప్రజల్లో ఆగ్రహానికి కారణం అయ్యాయి.మేము నగదు పంచాం. చెప్పేందుకు వాలంటీర్లు ఉన్నారు. మాకంటూ ప్రత్యేక ఓటర్లు ఉన్నారు.. ఇలా ఏవేవో చెప్పుకొని సొంత పార్టీ మనుషులను నమ్మలేదు. ప్రాధాన్యం ఇవ్వలేదు. పైగా అధినేతను కలవాలంటే కట్టడి. అపాయింట్మెంట్ దొరకాలంటే అతి కష్టం. ఇటువంటి అంశాలన్నీ అధికార పార్టీ నేతల్లో అసంతృప్తికి దారితీసాయి.తామే అభ్యర్థులం అన్న రీతిలో గత ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు గట్టిగానే పోరాడాయి. కానీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్లే అన్ని అయ్యారు. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పట్టించుకునే వారు కరువయ్యారు. అసలు ఎమ్మెల్యేలే ఉత్సవ విగ్రహాలుగా మారారు అన్న ఆరోపణలు వచ్చాయి.ఇవన్నీ ఓటమికి కారణాలే.
ప్రజా అంగీకారం లేదు - అమర్ నాధ్
ఏపీలో వైసీపీకి దారుణ పరాజయం ఎదురయ్యింది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేదు. అన్నిచోట్ల అదే పరిస్థితి. కొన్ని జిల్లాల్లో అయితే వైట్ వాష్ చేసింది. ఉత్తరాంధ్రలో అయితే రెండు స్థానాలకు పరిమితం అయ్యింది. దీంతో రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా మూడు రాజధానులకు ప్రజలు హర్షించలేదని స్పష్టమైంది. రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో కూడా ప్రజలు మద్దతు తెలపలేదు. అమరావతిలో కూడా ఆదరణ దక్కలేదు. దీంతో వైసీపీలోనే రాజధాని అంశంపై స్వరం మారుతోంది.2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధానిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 33 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 7వేల కోట్లతో వివిధ నిర్మాణ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ప్రపంచానికి తలమానికంగా అమరావతి రాజధాని నిర్మిస్తామని నాడు చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే పనులు జరుగుతుండగానే 2019 ఎన్నికలు వచ్చి పడ్డాయి. ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడం, వైసిపి అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. ఇలా అధికారంలోకి వచ్చిన తరువాత వైసిపి సర్కార్ అమరావతి పై విషం చిమ్మింది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. అప్పటినుంచి అమరావతి ఉద్యమం ప్రారంభమైంది. పతాక స్థాయికి చేరుకుంది. ప్రభుత్వం నుంచి ఉక్కు పాదం ఎదురయ్యింది. అలాగని మూడు రాజధానుల అంశం సైతం పురుడుబోసుకోలేదు. ఇవన్నీ రాష్ట్ర ప్రజల్లో ఆగ్రహానికి కారణం అయ్యాయి. విశాఖపట్నం ప్రజలు కూడా ఆహ్వానించలేదు. అదే సమయంలో అమరావతికి వేదికగా నిలిచే గుంటూరు, కృష్ణాజిల్లాలో సైతం వైసీపీకి ప్రాతినిధ్యం దక్కలేదు. రెండింటికి చెడ్డ రేవడిగా మారింది వైసీపీ పరిస్థితి.ఈ ఎన్నికల్లో గెలిస్తే విశాఖ నుంచి ప్రమాణస్వీకారం చేస్తానని జగన్ ప్రకటించారు. జూన్ 9న ప్రమాణ స్వీకారానికి వైసీపీ నేతలు ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. అదే రోజున విశాఖలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లు బుక్ అయ్యాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తద్వారా విశాఖ రాజధాని అని ముందుగానే సంకేతాలు పంపించారు. కానీ వారు అనుకున్నది ఒకటి.. అయ్యింది ఒకటి అన్న పరిస్థితి తయారయ్యింది. కనీసం ప్రజలు ఆహ్వానించలేదు. వైసీపీని ఆదరించలేదు. దారుణంగా తిరస్కరించారు. దీనిపై మాట్లాడిన మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు రాజధానికి రెఫరండంగా తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలు విశాఖ రాజధానిని ఆహ్వానించలేదని చెప్పుకొచ్చారు. ఓటమి పై పోస్టుమార్టం చేస్తామని.. ఎక్కడలోపం జరిగిందో తెలుసుకుంటామని ప్రకటించారు.మొత్తానికైతే రాజధానుల విషయంలో తప్పు జరిగిందని వైసీపీ నేతలు ఒప్పుకోవడం విశేషం.

Related Posts