YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సెలవుల్లో ఉన్నత అధికారులు

సెలవుల్లో ఉన్నత అధికారులు

విజయవాడ, జూన్ 7,
ఎపీలో వేట ప్రారంభమైంది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై వేటు పడనుంది. కొత్త ప్రభుత్వం అప్పుడే కొరడా ఝలిపిస్తోంది. వైసీపీ హయాంలో, ఎన్నికల సమయంలో అధికార పార్టీకి కొమ్ము కాసి.. టిడిపి జనసేన నేతలపై ఉక్కు పాదం మోపిన అధికారులను తప్పించే పనిలో పడింది. ఎప్పటికీ సీఎంను కంట్రోల్ లోకి తీసుకున్నారు చంద్రబాబు. సి ఎస్ జవహర్ రెడ్డి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు అందరిపై వేటుకు రంగం సిద్ధం చేశారు. దీంతో అధికారులంతా మూకుమ్మడి సెలవు పెడుతున్నారు. ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి అధికారికంగా సెలవుపై వెళ్లారు. ఆయన జూన్ నెలకరుణ రిటైర్ కాబోతున్నారు. దీంతో ఆయన రిటైర్మెంట్ తీసుకునే వరకు సెలవులోనే ఉండనున్నారు. కేవలం కొత్త ప్రభుత్వం వేటు వేస్తుందన్న కోణంలోనే ఆయన సెలవు పెట్టినట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇక సలహాదారులను సైతం తప్పించబోతున్నారు. ఎవరికి వారు రాజీనామా చేస్తే సరే.. లేదంటే వెంటనే తప్పించాలని ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ఎప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. మిగతావారు సైతం ఆయన బాటలోనే ఉన్నారు. వీలైనంతవరకు పదవికి రాజీనామా చేయాలని అందరు నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్ గా ఉన్న రావత్ సైతం సెలవుపై వెళ్లారు. సిఐడి చీఫ్ సంజయ్ కూడా సెలవు పై వెళ్లేందుకు మొగ్గు చూపారు. కానీ తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన సెలవులను రద్దు చేసుకున్నారు. ఇక బొత్స సత్యనారాయణ విద్యా శాఖ మంత్రిగా ఉండగా.. ఈసీ నిబంధనలకు వ్యతిరేకంగా టీచర్ల బదిలీలు జరిగాయి. బొత్స ఒత్తిడితో జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో టీచర్ల బదిలీలను కొత్త ప్రభుత్వం హోల్డ్ లో పెట్టింది. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికైతే ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న మునుపే వేటకు దిగడం ఆందోళన కలిగిస్తోంది.

Related Posts