YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

డబ్బు సంచులతో వస్తున్నారు... జాగ్రత్త ! దేవినేని రమణ 19వ వర్ధంతి సభలో మంత్రి దేవినేని ఉమా

 డబ్బు సంచులతో వస్తున్నారు... జాగ్రత్త !  దేవినేని రమణ 19వ వర్ధంతి సభలో మంత్రి దేవినేని ఉమా

నందిగామ నియోజకవర్గంలోని పలు పల్లెల్లో స్వర్గీయ దేవినేని వెంకట రమణ 19వ వర్ధంతి సభలు సోమవారం ఘనంగా జరిగాయి. పరిటాల, కంచికచర్ల, కీసర, నందిగామ, చందర్లపాడు తదితర చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దేవినేని వెంకట రమణ-ప్రణీతల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కంచికచర్ల, నందిగామలలో పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. ఈ సభలలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నందిగామ నేల సీమలో దేవినేని వెంకట రమణ జ్ఞాపకాలు నిత్య జ్ఞాపకాల ని అభివర్ణించారు. రమణన్న లేని నందిగామ ను ఉహించలేమని చెప్పారు. వేదాద్రి ఎత్తిపోతల పథకం రమణ మానస పుత్రికని,  కృష్ణా నది యేటి ఒడ్డున ఎన్నో ఎత్తిపోతల పథకాలతో రైతులకు మేలు చేసిన అపర భగీరథుడని ఉమా కొనియాడారు. ఆయన ప్రగతి దారుల్లోనే తాను, నందిగామ ఎమ్మెల్యే సౌమ్య పయనిస్తున్నట్లు చెప్పారు.  నిన్నటిదాకా మనపార్టీలోనే ఉండి, ఇప్పుడు కొత్త పార్టీ వేషం కట్టి  కొందరు మనల్ని తిడుతున్నట్లు పరోక్షంగా వైసీపీ నాయకులను విమర్శించారు. డబ్బు సంచులతో వచ్చి పల్లెల్ని కలుషితం చేస్తున్నారని అట్టి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి ఉమా రమణ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించారు. అంతకుముందు రమణ తల్లిదండ్రులు దేవినేని శ్రీమన్నారాయణ, సీతమ్మ , కుటుంబ సభ్యులతో రమణ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.

Related Posts