YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎవరికో మంత్రి పదవి...

ఎవరికో మంత్రి పదవి...

హైదరాబాద్, జూన్ 7 
ప్రధాని నరేంద్రమోదీ తన మంత్రి‌ వర్గంపై ఫోకస్ పెట్టారు. ఏ రాష్ట్రానికి ఎన్నేసి పదవులు ఇవ్వాలన్న దానిపై చర్చిస్తున్నారు. అన్నింటికంటే ముందుగా తెలంగాణ విషయాని కొద్దాం. మెజార్టీ తగ్గిన నేపథ్యంలో ఈసారి తెలంగాణకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తోందితెలంగాణ నుంచి ఇద్దరిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవాలని భావిస్తున్నారట ప్రధాని నరేంద్రమోదీ. వారికి  సహాయ మంత్రులు ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రేసులో మాజీ మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ లాంటి నేతలు పోటీ పడుతున్నారు.వీళ్లలో ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. ఈసారి బండి సంజయ్‌కి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారట బీజేపీ హైకమాండ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్‌ని తప్పించి అధ్యక్ష పదవి బాధ్యతలను కిషన్‌రెడ్డికి అప్పగించారు. ఆ సమయంలో బండి సంజయ్‌కి ప్రధాని నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.ఇకపోతే మరొకరు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అందులో కిషన్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటెల రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరి నరేంద్రమోదీ- అమిత్ షాలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి. ఏపీకి ఐదారు డిమాండ్ చేస్తున్నట్లు నేపథ్యంలో కనీసం తెలంగాణకు రెండైనా కేటాయిస్తే బాగుంటుందని కమలనాధుల ఆలోచనగా చెబుతున్నారు. కేబినెట్ మంత్రులపై శుక్రవారం సాయంత్రం నాటికి ఓ కొలిక్కి రావచ్చని అంటున్నారు.

Related Posts