YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీఎం అయిన తరువాత జగన్ బాగా మారిపోయారు

సీఎం అయిన తరువాత జగన్ బాగా మారిపోయారు

తిరుపతి:
బిజేపి నేత, మాజీ ఎంపీ వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. నేను ఎంపీగా ఉండగా జగన్ నా సలహాలు పాటించారు. సీయం గా గెలుచిన తరువాత జగన్ బాగా మారిపోయారు. రెడ్డి సామాజిక వర్గంలో ధనంజయరెడ్డి, విజయసాయిరెడ్డి,సజ్జల మిథున్ రెడ్డి వలనే వైసీపీ వీడాల్సి వచ్చింది. వైసీపీలో సొంత పార్టీ వారిపై కేసులు పెట్టించిన ఘనత సజ్జలది. సిలికా,ఇసుకా అక్రమ రవాణా అడ్డు కోవడం వారికి తప్పుగా కన్పించింది. రిటైర్ ఐఏఎస్ అధికారిగా నాకు పాలనపై అవగాహన ఉంది. అక్రమాలు అడ్డుకున్న కారణంగా వైసీపీలో టిక్కెట్ దక్కకున్న భాధపడలేదు. ప్రజలకు సేవ చేయాలని చంద్రబాబు, మోడి ఆలోచనలు నచ్చి బిజేపిలో చేరి టికెట్ పొందాను. సహజ వనరులు దోచుకున్న  బియ్యపు మదుసూదన్ రెడ్డి, మిథున్ రెడ్డిలపై జగన్ కు పిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకులేదు. వెనకబడిన వర్గాలకు అబిప్రాయాలకు జగన్ గౌరవించే స్వభావం లేదు. జగన్ కోటరీలోని ఐదారుమంది రెడ్లు వలనే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని అన్నారు. ఓటమి చెందినా నా వంతుగా తిరుపతి పార్లమెంటు ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధికి కృషి చేస్తాను. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. చాలాతక్కువ మెజారిటీతో ఓడిపోయాను. గతంలో జగన్,విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి లకి సలహాలు ఇచ్చినా పెడచెవిన పెట్టారు. జగన్ జైల్లో వున్నప్పుడు మంచి మనిషిగా  బయటికి వచ్చినప్పుడు స్వార్థ పరుడిగా వ్యవహరించారు. గడచిన 5సంవత్సరాలు ప్రజాస్వామ్యం లేదు. నియంతృత్వం,అరాచక పాలన నుంచి కాపాడుకోవడానికి బీజేపీ లో చేరాను. దీనికి అంతం చేయడానికి ముందుకు వచ్చిన చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ని అభినందిస్తున్నాను. ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా మోడీ,బీజేపీ అన్యాయం చేయలేదు. తిరుపతిలో నేను గత 15 సంవత్సరాల్లో పలు అభివృద్ధి పనులు చేశాను. ఏపీకి ప్రత్యేక హోదా ను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు.

Related Posts