YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాలయ్యకు ఘన స్వాగతం

బాలయ్యకు ఘన స్వాగతం

హిందూపురం
ఏపీలో జరిగిన హోరాహోరీ గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన ఎమ్మెల్యే బాలకృష్ణ తొలిసారిగా శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో అడుగు పెట్టారు. బాలకృష్ణకు అడుగడుగున నీరాజనం పలికారు టిడిపి శ్రేణులు. కర్ణాటక సరిహద్దు లో కొడికొండ చెక్పోస్ట్ వద్ద ఆ ప్రాంత టిడిపి నాయకులు కార్యకర్తలు బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు. అక్కడినుండి ఎమ్మెల్యే బాలకృష్ణ భారీ కాన్వాయ్ తో హిందూపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో కి చేరుకున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన టిడిపి కేంద్ర రాజకీయాల్లో కీలక బాధ్యత వహించడంపై స్థానిక టిడిపి కార్యకర్తల్లో ఆనందోత్సవాలు వెళ్లి విరిసాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ కు స్థానిక టిడిపి నాయకులు బ్రహ్మ రథం పట్టారు ఆధ్యాంతం  బాలయ్యకు కొ డికొండ.చెక్పోస్ట్ నుండి హిందూపురం లోని తన క్యాంప్ కార్యాలయం వరకు భారీ ఎత్తున తరలివచ్చారు టిడిపి శ్రేణులు. అయితే బాలకృష్ణ తన క్యాంప్ కార్యాలయంలోకి అడుగుపెట్టడానికి శుభ ముహూర్తం చూసుకొని కాసేపు వెయిట్ చేశారు బాలకృష్ణ. శుభ ముహూర్తం మేరకు బాలకృష్ణ తన క్యాంప్ కార్యాలయంలోకి కుడికాలు మోపి ఇంట్లోకి వెళ్లారు బాలకృష్ణ. ఏది ఏమైనప్పటికీ బాలకృష్ణ హిందూపురం పరిసర ప్రాంతాల్లో బాలయ్య ఓ క్రేజ్ లో తన ఇమేజింగ్ చాటుకున్నట్లు హిందూపురంలో హార్ట్ టాపిక్ గా మారింది

Related Posts