YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైకమాండ్ దగ్గర తగ్గిన రేవంత్... పవర్

హైకమాండ్ దగ్గర తగ్గిన రేవంత్... పవర్

హైదరాబాద్, జూన్ 10
పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వచ్చిన  సీట్లపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటి  సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ సాధించిన ఫలితాలపై సమీక్ష  చేశారు. కొన్ని  రాష్ట్రాల్లో సాధించిన ఫలితాలపై ఎంతో సంతప్తి వ్యక్తం చేసినా..  అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపైన ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తచేశారు. తెలంగాణా, హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో  ఉండి కూడా అనుకున్న సీట్లను  సాధించలేదని ఆయన ఫీలయ్యారు.  అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయిందని ఖర్గే తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లను పక్కన పెడితే.. తెలంగాణలో కనీసం పదమూడు స్థానాలను కాంగ్రెస్ హైకమాండ్ ఆశించింది. రేవంత్ రెడ్డి కూడా అన్ని సీట్లు తీసుకొచ్చి చూపిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఎనిమిది సీట్లతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఐదు నెలలు మాత్రమే అయ్యింది. 2023 నవంబర్ 30వ తేదీన జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. మే 13వ తేదీన జరిగిన పార్లమెంటు పోలింగులో పార్టీకి కేవలం 8 సీట్లు మాత్రమే దక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 64 సీట్ల దామాషాను చూసుకుంటే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు 9 సీట్లు దక్కుండాలి. కాని పార్టీ గెలిచింది 8 సీట్లు మాత్రమే. ఇక్కడ విషయం ఏమిటంటే మొదటినుండి రేవంత్ రెడ్డి మాట్లాడుతు పార్టీకి 13 సీట్లు గ్యారెంటీగా వస్తాయని చెప్పారు. అయితే చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ చేతులెత్తేయడంతో బీజేపీకి వరంగా మారింది.  దాంతో బీజేపీ పుంజుకుని ఎనిమిది సీట్లకు పెరిగింది.  కాంగ్రెస్ పరువు మాత్రం నిలిచింది.   రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ప్రభుత్వానికి మప్పు ఉంటుందన్న ఉద్దేశంతో గట్టిగా ప్రయత్నించారు.  27 రోజుల్లో రేవంత్ 53 బహిరంగసభల్లో పాల్గొన్నారు. సభలే కాకుండా కార్నర్ మీటింగులు, రోడ్డుషోలు, ర్యాలీలు అదనంగా పాల్గొన్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ లో ఐదింటిని పార్టీ అమలు కూడా చేసింది. ఇంతచేసినా పార్టీకి అనుకున్నన్ని సీట్లు దక్కలేదన్నదే ఖర్గే బాధ. ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ ఎంతచెప్పినా 10 సీట్లకైతే తగ్గదనే అందరు అనుకున్నారు. పార్టీ నేతలు కూడా అదే అంచనా వేశారు. తీరాచూస్తే ఎనిమిది సీట్లకు మాత్రమే పరిమితమైంది. 2019 ఎన్నికలతో పోల్చితే మంచి ఫలితం సాధించినట్లే అనుకోవాలి. 2019లో కాంగ్రెస్ గెలిచింది కేవలం 3 సీట్లలో మాత్రమే. ఇపుడు గెలిచిన ఎనిమిది సీట్లను చూస్తే మంచి ఫలితం సాధించినట్లే అనుకున్నా అంచనాలకు, ఆశించిన సీట్లకు చాలా తేడా ఉంది. ఈ విషయంలోనే ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం గెల్చుకోలేకపోవడం రేవంత్ రెడ్డికి ఇబ్బందికరమే. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో లక్షకుపైగా ఓట్ల ఆధిక్యం కనిపిస్తోంది. ఢిల్లీలో హైకమాండ్ వద్ద పలుకుబడి ఉన్న వంశీచంద్ రెడ్డి నిలబడ్డారు. అయితే గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివరికి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలిచారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ నేత మన్నె శ్రీనివాసరెడ్డి అసలు ప్రయత్నాలు చేయకపోవడంతో మైనస్ అయింది. తనపై కుట్ర చేశారని రేవంత్ ఆరోపణలు చేసినా..  ఫలితమే హైకమాండ్ చూస్తుంది.              అయితే రేవంత్ కు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ ఉండకపోవచ్చు. కాన ాయన మాటల్ని హైకమాండ్ గుడ్డిగా నమ్మే అవకాశం ఉండదని.. ఇతర నేతలకు ప్రాధాన్యం ఇస్తుందని అంటున్నారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడి నియామకంలో రేవంత్ చాయిస్ కన్నా..స్వతంత్రంగా  వ్యవహరించే నేతకు అవకాశం ఇచ్చినా  ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.  

Related Posts