హైదరాబాద్
పంజాగుట్ట ఎర్రమంజిల్ కాలనీలోని పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయం వద్ద హమాలీలు తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని నిరసన చేపట్టారు . పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలి రేట్లు పెంచాలని ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని హమాలీ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని హమాలీలకు ప్రాఫిడెంట్ ఫండ్ పెన్షన్ సౌకర్యం కల్పించాలని హమాలీలను నాలుగో తరగతి ఉద్యోగులుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ పథకాన్ని సంపూర్ణంగా రద్దుచేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేస్తున్న హమాలీలను పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. తాము కమీషనర్ను కలిసిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తామని కూర్చున్నారు. అదే సమయంలో కార్యాలయం నుంచి బయటకు వెళ్తున్న కమిషనర్ వారి వద్దకు వచ్చి వినతి పత్రాన్ని స్వీకరించారు. సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు నిరసన విరమించారు.