నెల్లూరు
వై.సి.పి.కి.రాజీనామా చేస్తున్నానని నెల్లూరు మేయర్ స్రవంతి వెల్లడడించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా నాకు కార్పొరేటర్ టికెట్ ను శ్రీధర్ రెడ్డీ ఇచ్చారు. అంతేగాక మేయర్ ను చేశారు. మాలాంటి ఎందరో కార్యకర్తలకు రాజకీయ అవకాశాలు కల్పించారు. రాజకీయాల్లో నాకు ధైర్యాన్ని ఇచ్చారు. శ్రీధర్ రెడ్డి వై.సి.పి.ని వీడినప్పుడు కూడా ఆయసతోనే ఉంటానని స్పష్టం చేశాం. అప్పట్లో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వై.సీ.పి.లోకి వెళ్ళాల్సి వచ్చింది. శ్రీధర్ రెడ్డి పై విమర్శలు చేయాలని అక్కడి నాయకులు మాపై ఒత్తిడి తెచ్చారు. శ్రీధర్ రెడ్డిని ఒక మాట కూడా మాట్లాడలేదు. మా తప్పులను శ్రీధర్ రెడ్డీ మన్నించి మమ్ములను అక్కున చేర్చుకోవాలని కోరుకుంటున్నామని ఆమె అన్నారు.