రవాణాశాఖ ఆధ్వర్యంలో నరసరావుపేట షాదీఖానలో నిర్వహించిన స్కూల్ బస్సు డ్రైవర్ల శిక్షణా, రీప్రెష్ కార్యక్రమంలో ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట, చిలకలూరిపేట ఇతర పల్నాడు ప్రాంతం నుంచి వెయ్యి మందికి పైగా స్కూల్ బస్సుల డ్రైవర్లు పాల్గోన్నారు. ఈ సందర్బంగా అయన ట్రాఫిక్ రూల్స్, డ్రైవింగ్ టైంలో డ్రైవర్లు తీసుకోలసిన జాగ్రత్తలపై రవాణాశాఖ ప్రచురించిన పుస్తకాన్ని విడుదల చేసారు. కోడెల మాట్లాడుతూ పిల్లల, స్కూల్స్ భవిష్యత్ డ్రైవర్ల చేతీలో ఉంది. నిర్లక్ష్యంతో మీరు చేసే చిన్న తప్పిదాల వల్ల వారి భౌవిష్యతే ప్రశ్నార్థకంగా మిగులుతుంది. పాఠశాల యాజమాన్యాలు సైతం నిష్ణాతులైన డ్రైవర్లను నియమించుకోవాలి. లేకపోతే వారు చేసే తప్పిదాల వల్ల మీ పాఠశాలల భౌవిష్యతే ప్రశ్నార్థకంగా మిగులుతుందని అన్నారు. విద్యార్థులనూ సురక్షితంగా ఇంటికి చేర్చడానికి ప్రతి బస్సులో డ్రైవర్ తో పాటు క్లీనర్ని నియమించాలి. నిత్యం అనేక పాఠశాల బస్సు ప్రమాదాలు చూస్తూ ఉంటాం.... అలాంటి జరగకుండా ఇలాంటి శిక్షణా కేంద్రాల ద్వారా డ్రైవర్లు జాగ్రత్తలు తెలుసుకోవాలని సూచించారు. వాహన పరిమితికి మించి ఎక్కించుకోవడం వలన నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. పల్నాడు ప్రాంత స్కూల్ డ్రైవర్ల మొత్తానికి ఈ రోజు ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. నేను కారు ఎక్కగానే డ్రైవర్ తో చెప్పే మాట నిదానంగా వెళ్లమని. మనకోసం ఇంటి దగ్గర మన ఫ్యామిలీ ఎదురుచూస్తుంది. వేగంగా పోయి మనం మిస్ కాకూడదు. రోడ్డు ప్రమాదంలో నా కుమారుడిని కోల్పోయాం కూడా అన్నారు. రోడ్డు ప్రమాదాల వలన దేశంలో నిమిషానికి 12మంది చనిపోతున్నారు. వారిలో పనిచేసే సామర్థ్యం ఉన్న యువతే ఎక్కువ. ప్రమాదంలో మీతో పాటు ఏమీ తెలియని అమాయకులని తీసుకెళుతున్నారు. ఇతర వాహనాల డ్రైవర్లకు కూడా ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. మా కుమారుడి పేరుతో లైసెన్స్ మేళ పెట్టండి... మొత్తం ఖర్చు నేను పెట్టుకుంటానని అయన అన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు రవాణా, పోలీస్ శాఖవారు తీసుకునే ప్రతి కార్యక్రమంలో నేను ముందుంటా. గతంలో ఇన్ని ప్రమాదాలు లేవు.. ఇవ్వాళ పెరిగిన వాహనాల ద్వారా నిత్యం ప్రమాదాల సంఖ్య పెరిగింది. డ్రైవర్లకు కనీస చదువు అవసరం. ఉత్సాహంతో వేగంగా వెళ్లి ప్రాణాలు కోల్పవద్దు ప్రపంచంలో ప్రతి దేశంలో ట్రాఫిక్ జోన్స్ గా విభజించి.....స్పీడ్ లిమిట్ ఉంటుంది. వాహనాల కండీషన్ నిత్యం పరిశీలించాలి. కోన్ని దేశాలలె 10సంవత్సరాల పైబడిన వాహనాలను స్క్రాప్ గా చేసేస్తారు. పోరపాటున కూడా డ్రైవర్లు మందుతాగి, నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయవద్దు.ఇలాంటి వారి వల్లే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. నలుగురు ఎక్కవలసిన ఆటోలో 10నుండి 15మంది ఎక్కడంతో నిత్యం ప్రమాదాలు. ఒక్క ప్రమాదం తర్వాత మనం చేయడానికి ఏం ఉండదూ. యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను చూస్తే సెక్యూరిటీ సైతం పక్కన పెట్టి సహయక చర్యలు చేపడుతామన్నారు.
ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ కమీషన్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, డీటీసీ రాజారత్నం, ఆర్టీవో సుబ్బరావు, ఎంపీపీ ప్రభాకర్, రోడ్ సేప్టీ ఎన్జీవో పద్మ ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.