హైదరాబాద్
గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు 2005లో యూపీఏ హయాంలోనే జరిగిందని గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ సుందరయ్యల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు సవాళ్లు అనే రాష్ట్ర సదస్సు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ గతంలో ఉపాధి కూలీలకు న్యాయం చేకూర్చడం జరిగిందని గుర్తు చేశారు. నేడు ఈ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తుందని మండిపడ్డారు. అంతేకాకుండా చట్టంలోని అంశాలను బిజెపి ప్రభుత్వం అణగదొక్కుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ గ్రామీణులకు ఉపాధి అవకాశాలపై ముగ్గు చూపడం జరిగిందని తెలిపారు. నేడు ప్రతి ఒక్కరూ కలిసి బిజెపి ప్రభుత్వంపై దాడి చేసి తమ హక్కులను పునరుద్ధరించుకోవాలని హితవు పలికారు.